Asianet News TeluguAsianet News Telugu

మళ్లీ విజృంభించనున్న కరోనా: భారత్ సహా పలు దేశాలకు డబ్ల్యూహెచ్‌ఓ వార్నింగ్

ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరోనా విజృంభించబోతోందా.. వ్యాక్సిన్లు దానిని అడ్డుకోలేవా అంటే అవుననే అంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో). భారత్ సహా పలు దేశాలను డబ్ల్యూహెచ్‌వో అప్రమత్తం చేసింది. డెల్టా వేరియెంట్‌లతో ముప్పు అధికంగా వుందని హెచ్చరిస్తోంది

Delta variant of coronavirus to become dominant strain in coming months says WHO ksp
Author
Geneva, First Published Jul 2, 2021, 9:39 PM IST

ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరోనా విజృంభించబోతోందా.. వ్యాక్సిన్లు దానిని అడ్డుకోలేవా అంటే అవుననే అంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో). భారత్ సహా పలు దేశాలను డబ్ల్యూహెచ్‌వో అప్రమత్తం చేసింది. డెల్టా వేరియెంట్‌లతో ముప్పు అధికంగా వుందని హెచ్చరిస్తోంది. ఇప్పటికే యూరప్‌లో ఒక్కసారిగా పది శాతం కేసులు పెరిగాయి. అలాగే రష్యాలో 24 గంటల్లో 115 మంది కరోనాతో మరణించారు. కరోనా వైరస్ అంతకంతూ మార్పు చెందుతోందని అందువల్ల అప్రమత్తంగా వుండాలని డబ్ల్యూహెచ్‌వో సూచిస్తోంది. 

మరోవైపు దేశంలో కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పడుతోంది. అయితే.. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎక్కువగానే ఉన్నాయి. వాటిని కూడా  కంట్రోల్ చేయడానికి కేంద్రం చర్యలు చేపట్టింది. కరోనా కేసులు అత్యధికంగా నమోదౌతున్న ఆరు రాష్ట్రాలకు అత్యున్నత స్థాయి బహుళ క్రమశిక్షణా ప్రజారోగ్య బృందాలను కేంద్రం తరలించింది. ఈ ఆరు బృందాలు కోవిడ్‌-19 నియంత్రణ, నియంత్రణ చర్యల్లో భాగంగా కేరళ, అరుణాచల్‌ ప్రదేశ్‌, త్రిపుర, ఒడిశా, చత్తీస్‌గఢ్‌, మణిపూర్‌ వంటి రాష్ట్రాలకు సాయం అందిస్తాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 

Also Read:థర్డ్ వేవ్ పెద్ద ప్రమాదకారి కాదు.. ఐసీఎంఆర్

ఈ బృందాలు రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యలపై అవగాహన పెంచుకుని, అడ్డంకులను తొలగించి.. ఆయా ప్రభుత్వాలు చేపడుతున్న కార్యకలాపాలను బలోపేతం చేస్తాయని ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రతి బృందంలో ఇద్దరు సభ్యులు ఉండగా...అందులో వైద్యుడు కాగా, మరొకరు ప్రజా వైద్య నిపుణుడు ఉంటారు. మణిపూర్‌ వెళ్లే బృందానికి డా. ఎల్‌.స్వస్తి చరణ్‌ నేతృత్వం వహిస్తారు. అరుణాచల్‌ ప్రదేశ్‌కు వెళ్లే బృందానికి డా. సంజరు సుధాకరన్‌, త్రిపుర బృందానికి డా. ఆర్‌ ఎన్‌ సిన్హా దిర్‌, కేరళ డా. రుచి జైన్‌, ఒడిశా డా. ఎ డాన్‌, చత్తీస్‌గఢ్‌ డా, దిబాకర్‌ సాహు నేతృత్వం వహిస్తారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios