మరణించిన మహిళ స్మశానంలో లేచింది.. శ్వాస తీసుకుంటూ కనిపించగానే మళ్లీ హాస్పిటల్‌కు
అమెరికాలోని అయోవా రాష్ట్రంలో ఓ మహిళ మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఆమెను స్మశాన వాటికకు తీసుకెళ్లారు. అక్కడ వారు ఆమె ప్రాణాలతో ఉన్నట్టు గుర్తించారు. దీంతో ఎమర్జెన్సీ నెంబర్‌కు కాల్ చేసి మళ్లీ హాస్పిటల్ పంపారు.

న్యూఢిల్లీ: వైద్యులు ఆమె పల్స్ చెక్ చేశారు. శ్వాసను పరీక్షించారు. ఇవి రెండూ లేవు. కొద్ది సేపు ఆగి ఇంకొన్ని పరీక్షలు చేసి మరణించిందని ధ్రువీకరించారు. వైద్యుల మాట మీద కుటుంబ సభ్యులు ఆమెను బాడీ బ్యాగ్‌లో జిప్ పెట్టి స్మశాన వాటికకు తీసుకెళ్లారు. అక్కడ జిప్ తీయగానే ఆమె శ్వాస పీల్చుతూ కనిపించారు. ప్యునెరల్ హోమ్‌లోని సిబ్బంది ఇది పసిగట్టి వెంటనే ఎమర్జెన్సీ నెంబర్‌కు కాల్ చేశారు. ఆమెను మళ్లీ హాస్పిటల్‌కు పంపించారు. అక్కడ ఆమె బ్రతికే ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. ఈ ఘటన అమెరికాలోని అయోవా రాష్ట్రంలో జనవరిలో చోటుచేసుకుంది.
66 ఏళ్ల మహిళ డిమెన్షియా, యాంగ్జైటీ, డిప్రెషన్‌తో బాధపడుతున్నది. ఆమె గ్లెన్ ఓక్స్ ఆల్జీమర్స్ స్పెషల్ కేర్ సెంటర్‌లో చికిత్స తీసుకుంటున్నది. ఇక్కడే నర్సు ఆమె మరణించినట్టు ధ్రువీకరించింది. జనవరి 3వ తేదీన నర్సు ధ్రువీకరించిన సమయంలో ఆమెలో పల్స్ లేదని పేర్కొన్నారు. దీంతో ఆమెను బాడీ బ్యాగ్‌లో పెట్టి ఆంకెనీ ఫ్యునెరల్ హోం అండ్ క్రెమెటరీకి పంపించారు.
Also Read: ఏడేళ్ల క్రితం చనిపోయిందనుకున్న మహిళ సజీవంగా.. హత్యానేరంలో జైల్లో యువకుడు.. ట్విస్ట్ ఏంటంటే...
ఆమెను ఆంకెనీ ఫ్యునెరల్ హోం అండ్ క్రెమెటరీ సిబ్బంది రిసీవ్ చేసుకుని బాడీ బ్యాగ్ జిప్ విప్పగానే ఆమె బతికే ఉన్నట్టు గుర్తించారు. దీంతో వారు వెంటనే 199 ఎమర్జెన్సీ నెంబర్‌కు కాల్ చేశారు. మెర్సీ వెస్ట్ లేక్స్ హాస్పిటల్‌కు పంపించారు. ఆమె ప్రాణాలతోనే ఉన్నారని ఆ హాస్పిటల్ సిబ్బంది తెలిపారు. అయితే, జనవరి 5న ఆమె ఆ హాస్పిటల్‌లో మరణించారు.
జనవరి 3వ తేదీన మరణించినట్టు పేర్కొన్న గ్లెన్ ఓక్స్ ఆల్జీమర్స్ స్పెషల్ కేర్ సెంటర్‌కు పది వేల అమెరికన్ డాలర్ల ఫైన్ వేశారు.