అత్యంత విషమంగా దలైలామా ఆరోగ్యం..?

First Published 11, Jun 2018, 4:48 PM IST
dalai lama health condition is critical
Highlights

త్యంత విషమంగా దలైలామా ఆరోగ్యం..?

బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది.. గత కొద్దిరోజులుగా ఆయన ప్రొస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు.. దీనికి సంబంధించి రెండేళ్లుగా అమెరికాలో దలైలామా ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు.. 82 ఏళ్ల వయసులో కూడా బౌద్ధమత వ్యాప్తి.. టిబెటన్ల సంక్షేమం గురించి ఆయన తపిస్తున్నారు.. వయసు కారణాల రీత్యా ఆశ్రమానికి ఎక్కువగా పరిమితమవుతున్నారు.. ఏడాది నుంచి భారత ప్రభుత్వం కూడా ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీస్తోంది.. మరోవైపు దలైలామా ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న వార్తలను సెంట్రల్ టిబెటిన్ అడ్మినిస్ట్రేషన్ ఖండించింది... దలైలామా వయసు రీత్యా ప్రస్తుతం ఎవ్వరిని కలవడం లేదని.. అంతకుమించి ఏం లేదని స్పష్టం చేసింది. అయితే సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను చూసి దలైలామా భక్తులు ఆందోళన చెందుతున్నారు.

loader