ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ పలు దేశాలకు పాకింది. ఇక చైనాలో పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. ఇప్పటికే చైనాలో ఈ వైరస్ కారణంగా 565మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 28, 018మంది ఆ వైరస్ సోకి అవస్థలు పడుతున్నారు. ఈ వైరస్ సోకకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు నెత్తీ,నోరు కొట్టుకొని మరీ చెబుతున్నారు.

కనీసం ముక్కుకి మాస్క్ లేకుండా ఎవరూ బయటకు అడుగు కూడా పెట్టడం లేదు. ఇదిలా ఉంటే... మరో దారుణమైన సంఘటన ఒకటి అక్కడ వెలుగుచూసింది. ఇప్పటి వరకు చాలా మంది ఈ వైరస్ సోకింది. అయితే ఓ చిన్నారికి మాత్రం పుట్టీపుట్టగానే సోకింది.

ఫిబ్రవరి 2వ తేదీన చైనాలో ఓ బాబు జన్మించాడు. వాడికి పుట్టిన 30గంటల్లో కరోనా వైరస్ సోకినట్లు గుర్తించారు. ఈ వైరస్ సోకిన అత్యంత చిన్న వయస్కుడు ఈ బుడతడే కావడం గమనార్హం. బాబు 3.25కేజీల బరువుతో పుట్టాడని వైద్యులు చెబుతున్నారు. కేవలం పుట్టిన 30గంటల్లోనే వైరస్ సోకినట్లు గుర్తించామని చెప్పారు. కాగా.. ప్రస్తుతం ఆ చిన్నారి పరిస్థితి నిలకడగానే ఉందని.. వైద్యుల పర్యవేక్షణలో ఉంచామని అధికారులు చెబుతున్నారు.

Also Read కరోనా వైరస్ పేరు చెప్పింది.. రేప్ చేయడానికి వచ్చినోడు పరుగో పరుగో...

బిడ్డకు తల్లి కడుపులో ఉండగానే సోకినట్లు వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో గర్భిణీ స్త్రీలపై మరింత శ్రద్ధ తీసుకోవాలని తమకు అర్థమైందని అక్కడి వైద్యులు చెబుతున్నారు. బిడ్డ పుట్టిన తర్వాత వైరస్ సోకినవాళ్లు అక్కడ దగ్గినా.. ఈ వైరస్ సోకే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఇదిలా ఉండగా,  కరోనా వైరస్ కారణంగా ఇప్పటి వరకు 565మంది మృత్యువాతపడ్డారు. ఈ వైరస్ సోకిన తర్వా త అందించిన చికిత్సతో ఇఫ్పటి వరకు 1,153మంది కోలుకున్నారు. మరో 28,018మంది వైరస్ సోకి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరో 24,702మందికి వైరస్ లక్షణాలు సోకినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 186,354మందిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.