Asianet News TeluguAsianet News Telugu

ఈక్వెడార్ జైలులో ఘర్షణ.. 15 మంది మృతి.. 20 మందికి గాయాలు

సెంట్రల్ ఈక్వెడార్‌లోని లటాకుంగా జైలులో ఖైదీల మధ్య భీకర ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో 15 మంది చనిపోయారు. మరో 20 మంది గాయపడ్డారు. 

Clash in Ecuador prison.. 15 dead.. 20 injured
Author
First Published Oct 4, 2022, 1:09 PM IST

సెంట్రల్ ఈక్వెడార్‌లోని లటాకుంగా జైలులో దారుణం జ‌రిగింది. సోమవారం ఖైదీల మ‌ధ్య జ‌రిగిన ఘ‌ర్ష‌ణ చోటు చేసుకుంది. ఈ గొడ‌వ‌లో క‌త్తులు, తుపాకులు కూడా ఉప‌యోగించారు. దీంతో 15 మంది మృతి చెందారు. 20 మంది గాయ‌ప‌డ్డారు.

జ‌పాన్ మీదుగా దూసుకెళ్లిన ఉత్తర కొరియా బాలిస్టిక్ మిస్సైల్..

జాతీయ, అంతర్జాతీయ మాదకద్రవ్యాల అక్రమ రవాణా గ్రూపులే ఈ త‌గాదాకు కార‌ణ‌మ‌ని అధికారులు తెలిపారు. క్విటో రాజధానికి దక్షిణంగా 50 మైళ్ల (80 కిలోమీటర్లు) దూరంలో ఉన్న లటాకుంగా జైలులో మరణించిన వారి సంఖ్యను ఈక్వెడార్ జాతీయ శిక్షాస్మృతి సేవ ధృవీకరించింది. సిబ్బంది ఇంకా మృత‌దేహాల కోసం జైలులో వెతుకుతున్నారు. అయితే ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో ఒకటి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇందులో ఘ‌ర్ష‌ణ ప‌డుతున్న ఖైదీల అరుపులు, తుపాకుల కాల్పులు వినిపిస్తున్నాయి. వీటిని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

పెనిటెన్షియరీ సర్వీస్ ప్రకారం.. గత సంవత్సరం ఈక్వెడార్ జైళ్లలో 316 మంది ఖైదీలు చంపబడ్డారు. ఈ ఏడాది ఇప్పటివరకు 90 మంది చనిపోయారు. గత ఏడాది సెప్టెంబర్‌లో గ్వాయాక్విల్‌లోని లిటోరల్ పెనిటెన్షియరీలో అత్యంత దారుణమైన మారణకాండ జరిగింది, అక్కడ 125 మంది ఖైదీలు మరణించారు.

స్వీడిష్ జెనెటిస్ట్ స్వాంతె పాబోకు మెడిసిన్‌లో నోబెల్ ప్రైజ్.. హోమో సేపియన్ పూర్వీకుల జీనోమ్ ఆవిష్కరణ

ఈక్వెడార్ జైలు వ్యవస్థ సుమారు 30,000 మంది కోసం రూపొందించారు. అయితే గత నెల వ‌ర‌కు అందుబాటులో ఉన్న స‌మాచారం ప్రకారం.. 53 రాష్ట్ర జైళ్లలో 35,000 మంది ఖైదీలను బంధించారు. అయితే ఈ ఆండియన్ దేశం జైళ్లను పదేపదే ఊచకోతల‌కు వేధిక‌గా మారుతున్నాయి. ఎందుకంటే డ్ర‌గ్స్ మాఫియా గ్రూపులు అధికారం, మాదకద్రవ్యాల పంపిణీ హక్కుల కోసం పోరాడుతున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios