ఈ ఏడాదికి గాను మెడిసిన్‌లో నోబెల్ ప్రైజ్‌ను స్వీడన్‌కు చెందిన జెనెటిస్ట్ స్వాంతె పాబో గెలుచుకున్నారు. ఆయన మనిషి పూర్వీకుడైన హొమినిన్‌ కుటుంబానికి చెందిన (అంతరించిపోయిన) సభ్యుడి జీనోమ్‌ ఆవిష్కరణ, మానవ పరిణామానికి సంబంధించిన పరిశోధనలకు గాను ఈ పురస్కారాన్ని గెలుచుకున్నట్టు నోబెల్ జ్యూరీ ఓ ప్రకటనలో వెల్లడించింది. 

న్యూఢిల్లీ: నోబెల్ బహుమతుల ప్రకటనలు మొదలయ్యాయి. మెడిసిన్ లేదా ఫిజియాలజీ విభాగంలో తొలిగా అవార్డును ప్రకటించారు. ఈ ఏడాదికిగాను మెడిసిన్స్‌లో నోబెల్ ప్రైజ్‌ను స్వీడన్‌కు చెందిన జెనెటిస్ట్ స్వాంతె పాబో గెలుచుకున్నారు. ఆయన అంతరించిపోయిన హొమినిన్స్ (మనిషికి ముందటి జీవులు.. అంటే హోమో సేపియన్స్ కంటే కూడా ముందు జీవించిన.. ఇప్పుడు అంతరించిపోయిన వారి జీనోమ్స్‌కు సంబంధించి ఆవిష్కరించారు) జీనోమ్స్‌క సంబంధించి, మానవ పరిణామానికి సంబంధించిన ఆవిష్కరణలు చేశారు. ఈ ఆవిష్కరణలకు గాను స్వాంతె పాబోకు నోబెల్ పురస్కరాన్ని సోమవారం ప్రకటించారు.

నేటి మానవునికి పూర్వీకుడైన నియాండెర్తల్ జీనోమ్‌ను పాబో సీక్వెన్స్ చేశాడు. అంతేకాదు, ఇప్పటి వరకు మన గమనంలో లేని హొమినిన్ (డెనిసోవా)ను ఆవిష్కరించారు. ఇది సంచలన ఆవిష్కరణ. 

Scroll to load tweet…

అంతేకాదు, ఈ అంతరించిపోయిన హొమినిన్స్ నుంచి హోమో సేపియన్స్‌కు జీన్స్ ట్రాన్స్‌ఫర్ అయినట్టు కూడా కనుగొన్నారు. సుమారు 70 వేల సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుంచి వలస ప్రారంభమైన తర్వాత ఇది జరిగింది. పురాతన లేదా మనిషి పూర్వీకులైన హొమినిన్స్‌ల నుంచి నేటి మనిషి వరకు సాగిన ఈ జీనోమ్ బట్వాడ.. ప్రస్తుత మనిషి ఫిజియోలాజికల్‌లోనూ ప్రాసంగికత కలిగి ఉన్నదని నోబెల్ ప్రకటనలో పేర్కొంది. ఇన్ఫెక్షన్స్ అటాక్ చేసినప్పుడు మన రోగ నిరోధక శక్తి రియాక్ట అయ్యే విధానాన్ని ఇందుకు ఉదాహరణగా తెలిపింది. పాబో అద్భుత ఆవిష్కరణలు.. పరిశోధనలు ఒక కొత్త సైంటిఫిక్ డిసిప్లీన్‌కు దారి తీస్తున్నాయని వివరించింది.

మాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎవల్యూషనరీ ఆంథ్రపాలజీలో స్వాంతె పాబో డైరెక్టర్‌గా చేస్తున్నారు.

నోబెల్ బాడీ మరో వారం వ్యవధిలో మిగతా విభాగాల్లోనూ అవార్డు గ్రహీతల పేర్లను ప్రకటించనుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, లిటరేచర్, పీస్, ఎకనామిక్స్ విభాగాల్లో త్వరలోనే ఈ ప్రకటనలు రానున్నాయి.