చైనాలో లోదుస్తులు ధరించి మహిళలు మోడలింగ్ చేయడం ద్వారా ఆన్‌లైన్‌లో అభ్యంతరకర దృశ్యాలు బహిరంగంగా అందరికీ చేరువ అవుతున్నాయని పేర్కొంటూ వాటిని వెంటనే ప్రభుత్వం తొలగిస్తున్నది. చాలా సార్లు అలాంటి వీడియోలపై నిషేధం విధిస్తున్నది. దీంతో లైవ్ స్ట్రీమ్ ఫ్యాషన్ కంపెనీలు మహిళలకు బదులు పురుషులతో మహిళల లోదుస్తుల మోడలింగ్ చేయిస్తున్నది.

న్యూఢిల్లీ: మహిళలు లోదుస్తులను ధరించి మాడలింగ్ చేయడంపై చైనా విరుచుకుపడుతున్నది. లోదుస్తుల ధరించి వయ్యారాలు పోయే మహిళా మోడలింగ్ వీడియోలపై నిషేధం విధించింది. అందుకే అవి ఆన్‌లైన్‌లో కనిపించినా.. మరో చోట లోడింగ్ అవుతున్నా.. వెంటనే ఆగిపోతున్నాయి. లోదుస్తులు ధరించిన మహిళల దేహాలను బహిరంగంగా చూపించడం తగదని చైనా ప్రభుత్వం భావిస్తున్నది. అందుకే లోదుస్తులు ధరించిన ఫీమేల్ మోడల్స్ వీడియోలను వెంటనే చైనా ప్రభుత్వ షట్ డౌన్ చేసేస్తున్నది. లేదా ఏకంగా నిషేధమే విధిస్తున్నది. కానీ, ఈ చర్యలతో చైనాకు చెందిన లైవ్ స్ట్రీమ్ ఫ్యాషన్ కంపెనీలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అవి లింగరీలను ప్రదర్శించి లేదా మోడలింగ్ చేసి కస్టమర్లను ఆకర్షించడం కష్టతరంగా మారింది. వారి లోదుస్తుల రకాలనూ ప్రచారంలోకి తేలేకపోతున్నది. అందుకే అవి ఒక కొత్త దారిని ఎంచుకున్నాయి. ఆ నిర్ణయం గురించి తెలుసుకుంటే మీరు కూడా నోరెళ్లబెడతారు.

మహిళలు లోదుస్తులు ధరించి మాడలింగ్ చేయడాన్ని చైనా నిషేధించినందున.. ఆ కంపెనీలు మహిళల స్థానంలో పురుషులతో మోడలింగ్ చేయిస్తున్నాయని న్యూయార్క్ పోస్టు అనే సైట్ రిపోర్ట్ చేసింది. ఔను.. మీరు చదివింది నిజమే. మహిళలకు బదులు పురుషులతో మహిళల లోదుస్తులను ధరింపజేసి మోడలింగ్ చేయిస్తున్నారు. ఇందుకోసం మేల్ మోడల్స్‌ను హైర్ చేసుకుంటున్నాయి. వారితో రకరకాల మహిళల లోదుస్తులను ప్రదర్శనకు పెడుతున్నాయి. 

టిక్ టాక్‌కు చైనా వర్షన్ డొయిన్‌లో పురుష మోడల్స్‌ మహిళల లోదుస్తుల వెరైటీలను ధరించి పోజులు ఇస్తున్న వీడియో వైరల్ అయింది. ఓ లైవ్ స్ట్రీమ్ ఫ్యాషన్ బిజినెస్ ఓనర్ మిస్టర్ జూ ఓ మేల్ మోడల్‌తో ఏకంగా సిల్క్ రోబ్ ధరింపజేసి ఆ ఫొటోలనుు సోషల్ మీడియా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు. ఆ ఫొటోలకు తేలికైన, విలాసవంతమైన భార్యల, వయోజన మహిళల కోసం అంటూ క్యాప్షన్ పెట్టారు.

Also Read: బ్యాలెట్ పేపర్లు ప్రింట్ చేయడానికి డబ్బుల్లేవని ఎలక్షన్స్ వాయిదా వేసిన శ్రీలంక!

ఈ క్లిప్‌పై నెటిజన్లు పెద్ద మొత్తంలో స్పందించారు. లైక్‌ లతో పాటు కామెంట్లు పెట్టారు. మహిళలు లోదుస్తులు ధరించిన వీడియోలను వెంటనే తొలగించడం ద్వారా పురుషులకు వాటిని వేసి చూపిస్తున్నారని, దీని ద్వారా మహిళల ఉపాధి అవకాశాలను కొల్లగొట్టారని ఓ యూజర్ కామెంట్ చేశారు. మరొకరు.. నిజానికి ఆ లింగరీలను మహిళల కంటే పురుషులే సరిగ్గా ధరిస్తున్నారని పేర్కొన్నారు. షేక్‌స్పియర్ కాలంలో ప్రకటనల్లో మహిళలకు బదులు పురుషులనే ఎంచుకున్నట్టు.. ఇప్పుడు లింగరీల ప్రదర్శనకు మహిళలకు బదులు పురుషులను ఎంచుకున్నారని కామెంట్ చేశారు. 

కాగా, ఈ కామెంట్లపై మిస్టర్ జూ రియాక్ట్ అయ్యారు. జూపై న్యూస్‌తో ఆయన మాట్లాడుతూ పురుషులతో మోడలింగ్ చేస్తే తప్పేంటి అని అడిగారు. మహిళలతో వాటిని మోడలింగ్ చేయించలేకపోతున్నాం కాబట్టి, పురుషులతో చేయిస్తున్నామని వివరించారు. ఈ మోడలింగ్ డైరెక్టర్లు ఎక్కువగా మహిళలే ఉంటున్నారని, అలాగని, వారు పురుషుల ఉపాధిని కొల్లగొట్టారని అనగలమా? అని ప్రశ్నించారు.

ఈ లూప్ హోల్ కూడా ఎన్నాళ్లు కొనసాగుతుందో చూడాలని నెటిజన్లు అనుకుంటున్నారు.