చైనాలో కరోనా మహమ్మారి మళ్లీ వణికిస్తున్నది. ఇక్కడ కేసులు మళ్లీ గణనీయంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కరోనా కేసులు మూడు రెట్లకు మించి నమోదు కావడం గమనార్హం. సాధారణంగా చైనా జీరో పాలసీని అమలు చేస్తుంది. ఒక్క కేసు రిపోర్ట్ అయినా.. చైనా తీవ్రంగా పరిగణిస్తుంది. అలాంటిది ఇక్కడ కేసులు మూడు రెట్లకు చేరడం ఆందోళనకరంగా మారింది.

న్యూఢిల్లీ: కరోనా వైరస్ పేరు చెప్పగానే చాలా మంది చైనా గుర్తుకు వస్తుంది. కారణం.. ఇక్కడ తొలిసారి కరోనా వైరస్‌ను గుర్తించారు. చైనా నుంచి ప్రపంచ దేశాలు కరోనా వేగంగా విస్తరించింది. చాలా దేశాలు ఇప్పటికీ కరోనా ముప్పును అనుభవిస్తూనే ఉన్నాయి. మన దేశంలో ఇది మూడ్ వేవ్‌లుగా ముంచుకువచ్చింది. ఇప్పుడు కేసులు తిరోగమన దశలో ఉన్నాయి. ఈ సందర్భంలో చైనాలో కేసులు మళ్లీ గణనీయంగా పెరుగుతున్నాయని తెలియవచ్చింది. గడిచిన రెండేళ్లలో గరిష్ట కేసులు ఇక్కడ నమోదు అవుతున్నాయిని నిపుణులు వెల్లడిదస్తున్నారు.

వార్తా కథనాల ప్రకారం, రెండేళ్లలో చైనాలో అత్యధిక కేసులు ఆదివారం రికార్డ్ అయ్యాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కట్టడి చర్యలకు శ్రీకారం చుడుతున్నారు. ఇందులో భాగంగానే షాంఘైలో స్కూల్స్, వ్యాపార సముదాయలు, రెస్టారెంట్లు, మాల్స్, అన్నింటిపై లాక్‌డౌన్ ఎఫెక్ట్ నడుస్తున్నది. కరోనా టెస్టులు చేయించుకోవడానికి షాంఘైలోని హాస్పిటల్ వెలుపల ప్రజలు బారులు తీరి కనిపిస్తున్నారని కరోనా టెస్టు చేయించుకోవడానికి వేచి చూస్తున్నారు.

ప్రస్తుతం చైనాలోని సుమారు 19 ప్రావిన్స్‌లలో డెల్టా వేరియంట్, ఒమిక్రాన్ వేరియంట్లు పంజా విసురుతున్నాయి. గడిచిన 24 గంటల్లో వైరస్ లక్షణాలతో కరోనా పాజిటివ్ కేసులు మూడు రెట్ల మేరకు రిపోర్ట్ అయ్యాయి. ఆదివారం ఒక్క రోజే ఇక్కడ 1,807 కొత్త కేసులు నమోదయ్యాయి. కాగా, శనివారం ఇక్కడ 476 కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఇందులో సింహభాగం ఈశాన్య ప్రావిన్స్ జిలిన్‌లోనే నమోదయ్యాయని అధికారులు తెలిపారు. ఈ ప్రావిన్స్‌లో 78 శాతం అంటే 1412 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.

ఈ ప్రొవిన్షియల్ అధికారి జిలిన్ గురించి మాట్లాడతూ, మెడికల్ వనరులను ఎక్స్‌పాండ్ చేసే సామర్థ్యం తమ దగ్గర లేదని, తద్వార కొన్ని చోట్ల సెంట్రలైజ్డ్ ఫెసిలిటీస్‌లో చాలా తక్కువ మంది మాత్రమే అడ్మిషన్ పొందగిలగారని వివరించారు.

కాగా, జిలిన్‌లో ఇది వరకు ఆరు విడతల్లో ప్రజలకు కరోనా టెస్టులు పూర్తయ్యాయని వివరించారు. ఇదిలా ఉండగా, చంగ్‌చున్‌లో చైనా అధికారులు పెద్ద ఎత్తున టెస్టులు నిర్వహిస్తున్నారు. చంగ్‌చున్‌లో సుమారు 90 లక్షల ప్రజలు నివసిస్తున్నారు. శుక్రవారం ఇక్కడ లాక్‌డౌన్ అమలు చేశారు. కాగా, షెంజన్‌లోని తొమ్మిది జిల్లాల్లోనూ రెస్టారెంట్లలో డైనింగ్, ఇండోర్ వేదికలు, ఎంటర్‌టైన్‌మెంట్ వంటివాటికి అనుమతులు ఇవ్వరాదు.

శుక్రవారం నాడు చైనా దేశవ్యాప్తంగా మరో 397 కొత్త ర‌కం క‌రోనా వైర‌స్ కేసులు న‌మోద‌య్యాయి. అందులో 98 కేసులు చాంగ్‌చున్ చుట్టూ ఉన్న జిలిన్ ప్రావిన్స్‌లో వెలుగుచూశాయి. కరోనా వైర‌స్ మహమ్మారి పట్ల చైనా “జీరో టాలరెన్స్” విధానం పాటిస్తోంది. ఒక‌టి లేదా అంతకంటే ఎక్కువ కేసులు కనుగొనబడిన ఏదైనా సంఘాన్ని లాక్ చేయమని అధికారులు పదేపదే పేర్కొంటున్నారు. చాంగ్‌చున్ చుట్టూ ఉన్న జిలిన్ ప్రావిన్స్‌లో కేసులు పెర‌గ‌డాన్ని అధికారులు గుర్తించారు. ఇప్ప‌టికే న‌గ‌రంలో పాక్షిక లాక్‌డౌన్‌ను ఆదేశించారు. ఇత‌ర న‌గ‌రాల‌తో ప్ర‌యాణ సంబంధాలను క‌ట్ చేశారు. ఇదిలావుండ‌గా, ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 453,964,556 క‌రోనా వైర‌స్ కేసులు న‌మోద‌య్యాయి. అలాగే, 6,052,854 మంది వైర‌స్ తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు.