చైనాలో కరోనా ఒమిక్రాన్ కేసు నమోదైంది. సోమవారం నాడు తొలి కేసు నమోదైందని అధికారులు ప్రకటించారు. విదేశాల నుండి వచ్చిన వ్యక్తికి ఈ వైరస్ సోకిందని అధికారులు ప్రకటించారు.
బీజింగ్: Chinaలో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కేసు నమోదైంది. టియాంజిన్ నగరంలో omicron కేసు నమోదైనట్టుగా చైనా అధికారులు ప్రకటించారు. డిసెంబర్ 9న విదేశాల నుండి నగరానికి వచ్చిన ప్రయాణీకుడిలో ఈ ఇన్‌ఫెక్షన్ ఉన్నట్టుగా గుర్తించినట్టుగా చైనా అధికారిక మీడియా ప్రకటించింది. ఒమిక్రాన్ సోకిన రోగికి ఆసుప్రతిలో చికిత్స అందిస్తున్నట్టుగా అధికారులు తెలిపారు.తూర్పు చైనా పారిశ్రామిక పవర్ హౌస్ ప్రావిన్స్ జెజియాంగ్ లో కరోనా కేసులు ఎక్కువగా నమోదౌతున్నాయి. వారంలో 190 కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ ఫ్యాక్టరీని మూసివేశారు అధికారులు. ఇదిలా ఉంటే britain లో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ తో సోమవారం నాడు ఒక్కరు మరణించారు. యూకేలో కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకుగాను బూస్టర్ డోసులు వేసుకోవాలని బ్రిటన్ సర్కార్ ప్రజలను కోరింది.
ఇంగ్టాండ్ లోని వయస్సులో పెద్దవాళ్లంతా బూస్టర్ డోసును వేసుకోవాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కోరారు. ఈ నెలాఖరులోపుగా బూస్టర్ డోస్ ను అందించాలని బ్రిటన్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది. ఇంగ్లాండ్ లోని ఆసుపత్రుల్లో 10 మంది కరోనా ఒమిక్రాన్ వైరస్ సోకిన రోగులు చికిత్స పొందుతున్నారని ఆరోగ్య కార్యదర్శి సాజిద్ జావిద్ సోమవారం నాడు చెప్పారు.బూస్టర్ డోస్ కరోనా ఒమిక్రాన్ వేరియంట్ నుండి 70 నుండి 75 శాతం వరకు రక్షణ కల్పిస్తోందని UK హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ అభిప్రాయపడింది. లక్ష మందికి పై ప్రజలు బూస్టర్ ను బుక్ చేసుకోవడానికి ప్రయత్నించడంతో సోమవారం నాడు NHS వెబ్‌సైట్ క్రాష్ అయిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి..బూస్టర్ డోస్ కోసం ప్రజలు వ్యాక్సిన్ సెంటర్ల వద్ద క్యూ కట్టారు. 30 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికి ఆన్‌లైన్ లో బూస్టర్ డోసులు వేసుకొనేందుకు బుకింగ్ చేసుకోనేందుకు బ్రిటన్ సర్కార్ అవకాశం కల్పించింది.18 ఏళ్లు నిండిన వారు కూడా తమ రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తైతే బూస్టర్ డోస్ ను తీసుకోవచ్చని అధికారులు తెలిపారు.
also read:డేంజర్ బెల్స్: యూకేలో ఒమిక్రాన్‌తో తొలి మరణం.. ధృవీకరించిన బ్రిటన్
యూకేలో కరోనా ఒమిక్రాన్ కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ప్రతి రెండు మూడు రోజులకు కేసులు రెట్టింపు అవుతున్నాయి. యూకే కరోనా నాలుగో స్థాయికి చేరుకొందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మే తర్వాత ఒమిక్రాన్ కారణంగా కరోనా కేసుల వ్యాప్తి మరింత పెరుగుతుందని అధికారులు అనుమానిస్తున్నారు.శనివారం నాడు నుండి యూకేలో అర మిలియన్ బూస్టర్ డోసులు అందించినట్టుగా అధికారులు ప్రకటించారు.యూకేలో కరోనా కేసుల పెరుగుదల ఒమిక్రాన్ ప్రధాన కారణమని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు. రానున్న రోజుల్లో ఆసుపత్రుల్లో రోగులతో నిండకుండా ఉండాలంటే ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని బోరిస్ జాన్సన్ తన టెలివిజన్ ప్రసంగంలో ప్రజలను కోరారు.యూకేలో కరోనా కేసుల పెరుగుదల ఒమిక్రాన్ ప్రధాన కారణమని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు. రానున్న రోజుల్లో ఆసుపత్రుల్లో రోగులతో నిండకుండా ఉండాలంటే ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని బోరిస్ జాన్సన్ తన టెలివిజన్ ప్రసంగంలో ప్రజలను కోరారు. యూకేలో 1239 కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. 12 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు వారిలో 81 శాతం మంది వ్యాక్సిన్ వేసుకొన్నారు. అంటే 46.7 మిలియన్ల మంది రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకొన్నారు.
