Coronavirus: చైనాలో మరో కొత్త వేరియంట్.. లాక్ డౌన్.. అన్ని బంద్ !

Coronavirus: క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ కార‌ణంగా చైనా మ‌రోసారి లాక్‌డౌన్ లోకి వెళ్లింది. క‌రోనా వైర‌స్ కొత్త వేరియంట్ వ్యాప్తి నేప‌థ్యంలోనే అక్క‌డి ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. 
 

China locks down city of 9 million amid new spike in Covid-19 cases

Coronavirus: గ‌త రెండు నెల‌లుగా గ‌ణ‌నీయంగా త‌గ్గిపోయిన క‌రోనా వైర‌స్‌.. మ‌ళ్లీ త‌న రూపు మార్చుకుని ప్ర‌పంచంపై పంజా విస‌రడానికి సిద్ధ‌మైందా? అంటే అవున‌నే స‌మాధానం వ‌చ్చే ప‌రిస్థితులు చైనాలో క‌నిపిస్తున్నాయి. క‌రోనా వైర‌స్ ను మొద‌టిసారిగా గుర్తించిన చైనాలో.. క‌రోనా వైర‌స్ మ‌రో కొత్త వేరియంట్ ప్ర‌స్తుతం పంజా విసురుతోంది. దీంతో చైనా మ‌ళ్లీ లాక్‌డౌన్ విధించింది. అన్ని కార్య‌క‌లాపాలు నిలిపివేసింది. ప్ర‌జ‌లు ప్ర‌జ‌లు ఇంట్లోనే ఉండి మూడు రౌండ్ల  క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాలంటూ ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

వివ‌రాల్లోకెళ్తే.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి. అయితే, చైనాలో కొత్త కేసులు త‌క్కువ‌గానే న‌మోదు అవుతున్న‌ప్పికీ.. మ‌రో కొత్త వేరియంట్ కేసులు ఆ దేశంలో అధికంగా వెలుగుచూస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే చైనా ప్ర‌భుత్వం 9 ల‌క్ష‌ల మంది జ‌నాభాను క‌లిగిన చాంగ్‌చున్‌లో  క‌రోనా కొత్త వేరియంట్ ను అధికారులు గుర్తించారు. ఇది అత్యంత వేగంగా వ్యాపిస్తుండ‌టంతో కేసులు పెరుగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే చైనా చాంగ్‌చున్‌లో లాక్ డౌన్ విధించింది. 

క‌రోనా వైర‌స్ కొత్త వేరియంట్ వ్యాప్తి గ‌ణ‌నీయంగా పెర‌గ‌డంతో లాక్‌డౌన్ విధించారు అధికారులు.  స్థానికులు ఎవ‌రూ ఇంటి నుంచి బ‌య‌ట‌కు రావొద్దని ఆంక్షలు పెట్టారు.  నిత్యావ‌స‌రాల కోసం ఫ్యామిలీ స‌భ్యుల్లో ఒక‌రే బ‌య‌ట‌కు వెళ్లాలని సూచించారు. అది కూడా రెండు రోజుల‌కు ఒక‌సారి మాత్రమే బయటకు రావాలని ఆంక్షలు విధించారు. మూడు రౌండ్ల క‌రోనా ప‌రీక్ష‌లు ఇంటి నుంచే చేయించుకోవాల‌ని సూచించారు. క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో అక్క‌డ కార్యాల‌యాలు, స్కూల్స్ మరోసారి మూత‌ప‌డ్డాయి. 

శుక్రవారం నాడు చైనా దేశవ్యాప్తంగా మరో 397 కొత్త ర‌కం క‌రోనా వైర‌స్ కేసులు న‌మోద‌య్యాయి. అందులో 98 కేసులు చాంగ్‌చున్ చుట్టూ ఉన్న జిలిన్ ప్రావిన్స్‌లో వెలుగుచూశాయి. కరోనా  వైర‌స్ మహమ్మారి పట్ల చైనా “జీరో టాలరెన్స్” విధానం పాటిస్తోంది. ఒక‌టి లేదా అంతకంటే ఎక్కువ కేసులు కనుగొనబడిన ఏదైనా సంఘాన్ని లాక్ చేయమని అధికారులు పదేపదే పేర్కొంటున్నారు. చాంగ్‌చున్ చుట్టూ ఉన్న జిలిన్ ప్రావిన్స్‌లో  కేసులు పెర‌గ‌డాన్ని అధికారులు గుర్తించారు. ఇప్ప‌టికే న‌గ‌రంలో పాక్షిక లాక్‌డౌన్‌ను ఆదేశించారు. ఇత‌ర న‌గ‌రాల‌తో ప్ర‌యాణ సంబంధాలను క‌ట్ చేశారు. ఇదిలావుండ‌గా, ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 453,964,556 క‌రోనా వైర‌స్ కేసులు న‌మోద‌య్యాయి. అలాగే, 6,052,854 మంది వైర‌స్ తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios