Asianet News TeluguAsianet News Telugu

న్యూఇయర్ నాడు గాల్వన్‌లో చైనా జెండా రెపరెపలు.. అసలు నిజం ఇదేనా..?

జనవరి 1న ఇండో - చైనా (indo china border) సరిహద్దుల్లోని గాల్వన్ వ్యాలీలో (galwan valley ) చైనా జెండాను (china flag) చైనా పీఎల్‌ఏ ఎగురవేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోతో గాల్వన్ భూమిలో ఒక్క అంగుళం కూడా ఇవ్వబోమని చైనా తన దేశస్థులకు సందేశం ఇచ్చింది. అయితే ఇప్పుడు ఈ వీడియోపై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

china flag hoisted in galvan valley on new year day know all truth and updates
Author
Beijing, First Published Jan 6, 2022, 9:45 PM IST

జనవరి 1న ఇండో - చైనా (indo china border) సరిహద్దుల్లోని గాల్వన్ వ్యాలీలో (galwan valley ) చైనా జెండాను (china flag) చైనా పీఎల్‌ఏ ఎగురవేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోతో గాల్వన్ భూమిలో ఒక్క అంగుళం కూడా ఇవ్వబోమని చైనా తన దేశస్థులకు సందేశం ఇచ్చింది. అయితే ఇప్పుడు ఈ వీడియోపై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చైనా ఒక నటుడితో ఈ వీడియోను చిత్రీకరించిందని చైనాకు చెందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ వీబో సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ వీడియో గాల్వాన్ వ్యాలీకి చెందినది కాదని, అక్సాయ్ చిన్‌లోని కొంత భాగానికి చెందినదని వీబో వాదిస్తోంది.

సీసీపీ మొత్తం వేడుకను నిర్వహించడానికి చైనీస్ నటులను ఉపయోగించారని సూచించారు. వీబో యూజర్లు ఎద్దేవా చేస్తున్నారు. కొంతమంది Weibo వినియోగదారుల ప్రకారం, CCP చైనీస్ నటుడు వు జింగ్ మరియు అతని భార్య, చైనీస్ నటి మరియు TV హోస్ట్  Xie Nan, జెండా ఎగురవేత వేడుకను షూట్ చేసేందుకు ఉపయోగించారని ఆరోపిస్తున్నారు. షూటింగ్ జరిగిన ప్రదేశం చైనా నియంత్రణలో ఉన్న అక్సాయ్ చిన్ ప్రాంతంలో గాల్వాన్ నదికి 28 కి.మీ వెనుక ఉందని వారు అంటున్నారు.

చైనీస్ సినిమా పరిశ్రమలోని అగ్ర నటుల్లో వూ జింగ్ ఒకరు. ఎన్నో సినిమాలు, నాటకాలలో ఆయన హీరోగా నటించారు. వుంగ్ తన కెరీర్‌లో చాలాసార్లు చైనీస్ సైనికుడి పాత్రను పోషించాడు. అతను చియన్స్ చిత్రం ది బ్యాటిల్ ఎట్ లేక్ చాంగ్‌జిన్‌లో PLA సోల్డర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇది చైనాలో ఇప్పటివరకు $200 మిలియన్ల బడ్జెట్‌తో నిర్మించిన అత్యంత ఖరీదైన చిత్రం. సినిమా కథను CCP ఆమోదిస్తున్నట్లు.. చైనా కమ్యూనిస్ట్ పార్టీ 100వ వార్షికోత్సవంలో భాగంగా ప్రకటించింది. వుంగ్ భార్య జి నాన్ 2007 డ్రామా సిరీస్ "జియాన్ జింగ్ టియాన్ జియా"లో నటిగా ప్రశంసలు అందుకున్నారు. ఆయన "ఎ చైనీస్ ఒడిస్సీ పార్ట్ త్రీ" (2016), "ది ఫేసెస్ ఆఫ్ మై జీన్" (2018) , "ది డే వి లిట్ అప్ ది స్కై" (2021)లో కూడా మంచి పాత్రలు పోషించారు. 

Weibo యూజర్లు చెబుతున్న దాని ప్రకారం.. దర్శకులు , జూనియర్ నటుల బృందం 24 డిసెంబర్ 21న వు జింగ్, Xie నాన్‌లు కొందరు PLA అధికారులతో కలిసి గల్వాన్‌లో జెండా వేడుకను నిర్వహించడానికి షూటింగ్ సైట్‌కు చేరుకున్నారు. షూటింగ్ పూర్తి కావడానికి దాదాపు నాలుగు గంటలు పట్టింది. ఈ వీడియోను 01 జనవరి 2022 నాడు జరిగిన సంఘటనగా చెబుతూ వీడియో విడుదల చేశారు. కాగా.. Weibo యూజర్లు.. ఈ వీడియోలో పాల్గొన్న నటీనటుల పేర్లను వెల్లడించిన కొద్దిసేపటికే, వారి ఖాతాలన్నీ బ్లాక్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios