సారాంశం

ఆరుగురు పిల్లల్ని ఆకలితో మాడ్చారు ఓ తల్లిదండ్రులు. వీరిలో ఇద్దరిని కుక్కల బోనులో బంధించారు. పోలీసులు ఈ చిన్నారులను రక్షించారు. 

లాస్ వెగాస్ : అమెరికాలోని లాస్ వెగాస్ లో దారుణ ఘటన వెలుగుచూసింది. ఆరుగురు చిన్నారులను వారి తల్లిదండ్రులు అతి దారుణంగా హింసించారు. తిండి పెట్టకుండా ఆకలితో మాడగొట్టారు. వీరిలో ఇద్దరిని కుక్కల బోనులో పెట్టారు. వీరి చెరనుంచి చిన్నారులను పోలీసులు విడిపించారు.

ఈ అమానుష ఘటనకు చెందిన వివరాలు ఇలా ఉన్నాయి.. ట్రావిస్ డాస్, 31, అతని భార్య అమండా స్టాంపర్, 33, ఇద్దరినీ జూన్ 11న అరెస్ట్ చేశారు. స్టాంపర్ వ్యాలీ వ్యూ బౌలేవార్డ్  ఫ్లెమింగో రోడ్ సమీపంలోని మందుల దుకాణం నుండి 911కి కాల్ చేసింది. ఆతరువాతే ఈ విషయం వెలుగులోకి వచ్చిందని లాస్ వెగాస్ రివ్యూ-జర్నల్ నివేదించింది.

ఫోన్ కొట్టేసిన దొంగతో ప్రేమలో పడిన మహిళ.. రెండేళ్లుగా సహజీవనం..

మీడియా కథనాల ప్రకారం.. పెద్ద పిల్లలలో ఒకరిని డాస్ చాలా దారుణంగా కొట్టాడు, తన 11 ఏళ్ల కొడుకు అప్పటికే చనిపోయాడని అనుకున్నాడు.  బోనులో ఉన్న ఇద్దరు పిల్లలలో ఒకరికి కళ్ళు వాచిపోయి, శరీరమంతా గాయాలతో ఉన్నారు. వీరు తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ అరెస్ట్ నివేదికలు చెబుతున్నాయి.

ఈ జంట ఫ్లెమింగో రోడ్‌కు సమీపంలో సింగిల్ బెడ్రూం ఇంట్లో వీరు తమ ఏడుగురు పిల్లలతో నివసిస్తున్నారు. వీరి పిల్లల వయసు 2 నుంచి 11 ఏళ్లలోపే.  పిల్లలందరినీ పోలీసులు రక్షించారు. తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేశారు. స్టాంపర్ జైల్‌హౌస్ ఇంటర్వ్యూలో.. తాను కూడా వేధింపులకు గురవుతున్నట్లు వెల్లడించింది.  ఆమె, డాస్‌ అరెస్టు అవ్వడానికి కొన్ని వారాల ముందు ఆమెమీద, ఆమె ఆరుగురు పిల్లల మీద శారీరక వేధింపులు పెరిగాయి. 

పిల్లలు వేధింపులకు గురవుతున్నట్లు 911 కి కాల్ చేసినట్లు తెలిపింది. అంతకు ముందే ఎందుకు చేయలేదనే దానికి కూడా వివరణ ఇచ్చింది స్టాంపర్... ‘నేను నా జీవితం, నా పిల్లలు, నా కుటుంబం గురించి భయపడ్డాను’ అని చెప్పుకొచ్చింది. చిన్నారులను దారుణంగా కొట్టడానికి కారణం... ఫ్రిజ్ లేదా ట్రాష్ క్యాన్ నుంచి ఆహారాన్ని దొంగిలించించాడని.. డాస్ బాలుడిని క్రమశిక్షణ పేరుతో హింసించాడు. 

డాస్ తన పిల్లలను భారీ వోక్, ఎక్స్‌టెన్షన్ కార్డ్స్,  బెల్ట్‌లతో కొట్టేవాడని స్టాంపర్ పోలీసులకు తెలిపింది. వారి శరీరంపై అనేక గాయాల గుర్తులున్నాయని తెలిపింది. జూలై 13న, డాస్‌పై 33 చైల్డ్ అబ్యూజింగ్ ఆరోపణలు, రెండు కిడ్నాప్ ఆరోపణలు మోపారు. స్టాంపర్‌పై ఏడు చైల్డ్ అబ్యూజింగ్ ఆరోపణలు అభియోగాలు మోపారు. పిల్లలను తీవ్రమైన శారీరక హాని నుండి రక్షించడంలో ఆమె విఫలమైందని ఆరోపించారు.

డాస్‌పై లైంగిక ట్రాఫికింగ్, శారీరక బలంతో బెదిరింపుతో ప్రాస్టిట్యూషన్ సంపాదన మీద ఆధారపడినట్లు అభియోగాలు మోపారు. వారుంటున్న అపార్ట్‌మెంట్‌ చీకటిగా ఉంది. అందులో అనేక కుక్కలు కూడా ఉన్నాయి. పిల్లలను బంధించిన బోను తెరవడానికి పోలీసులకు బోల్ట్ కట్టర్‌ అవసరం అయ్యింది. బోను తాళాలు పోయాయి అని కథనాల్లో పేర్కొన్నారు.