సెంట్రల్ మెక్సికోలోలో కాల్పులు చోటు చేసుకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా ఎనిమిది మంది మరణించారు. డ్రగ్స్ మాఫియాల మధ్య ఆధిపత్య పోరు కారణంగానే ఈ ఘటన చోటు చేసుకొందని పోలీసులు తెలిపారు..
షిలానో: Mexico సెంట్రల్ ప్రాంతంలో జరిపిన కాల్పుల్లో ఇద్దరు చిన్నారులు సహా ఎనిమిది మంది మరణించారు. Drugs మాఫియా ముఠాల మధ్య కాల్పుల్లో ఈ ఘటన చోటు చేసుకొందని Police తెలిపారు.
మంగళవారం నాడు రాత్రి Guanajuato రాష్ట్రంలోని సిలావో మున్సిపాలిటీలో ఇద్దరు ముష్కరులు వచ్చి ఇళ్లపై firing దిగారు. ఈ కాల్పుల్లో ఏడాది చిన్నారితో పాటు 16 ఏళ్ల బాలిక కూడా ఉందని పోలీసులు తెలిపారు.
also read:నాగాలాండ్ ఘటనలో సిట్ దర్యాప్తుకు ఆర్మీ అనుమతి
శాంటా రోసా డిలిమా, టాలిస్కో న్యూ జనరేషన్ కార్డెల్స్ మధ్య అధిపత్య పోరు కారణంగా గ్వానాజువా అత్యంత హింసాత్మక రాష్ట్రాల్లో ఒకటిా మారింది. డ్రగ్స్ రవాణాతో పాటు మార్కెట్ పై ఆధిపత్యం సాధించేందుకు ఈ ముఠాల మధ్య పోరు నెలకొంది.
ఈ ఏడాది నవంబర్ మాసంలో సిలావో ఇదే తరహలో రెండు దాడులు చోటు చేసకొన్నాయి. ఈ ఘటనల్లో 11 మంది మరణించారు. 2006 నుండి మెక్సికోలో సుమారు 3 లక్షలకు పైగా హత్యలు చోటు చేసుకొన్నాయని మెక్సికో అధికారుల గణాంకాలు చెబుతున్నాయి.. ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో మెక్సికోలో 25 వేల కంటే ఎక్కువ హత్యలు జరిగాయి. ఇది గత ఏడాది కంటే 3.4 శాతం తక్కువగా అధికారుల లెక్కలు చెబుతున్నాయి.
ఈ ఏడాది నవంబర్ 28న జకాటెకాస్‌లో చోటు చేసుకొన్న కాల్పుల్లో ఎనిమిది మంది మరణించారు. జాలిస్కో రాష్ట్ర సరిహద్దుకు సమీపంలోని వల్పరైసో పట్టణానికి సమీపంలో కాల్పులు చోటు చేసుకొన్నాయి. ఈ ఘటన జరిగిన ప్రదేశంలోత వాహనాలు, తుపాకులు లభించినట్టుగా పోలీసులు చెప్పారు. జకాటెకాస్‌లోని హైవే ఓవర్‌పాస్ లో మరో మూడు మృతదేహలను పలోలీసులు గుర్తించారు. ఈ ఘటన తర్వాత కాల్పుల ఘటన చోటు చేసుకొంది.
