సారాంశం

కెనడాలో ఇందిరా గాంధీ హత్యపై శకటం రూపొందించి, దానిని ప్రదర్శించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. భారత ప్రభుత్వం దీనిపై గురువారం మండిపడింది. ఇరు దేశాల మధ్య సంబంధాలకు ఇలాంటి చర్యలు మంచివి కావని హితవు పలికింది. తాజాగా ఆ దేశ ఎంపీ కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఆపరేషన్ బ్లూస్టార్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్యను ఖలిస్తాన్ మద్దతుదారులు సెలబ్రేట్ చేసుకోవడం వివాదాస్పదంగా మారింది. ఇప్పటికే ఈ చర్యపై భారత ప్రభుత్వం మండిపడింది. వేర్పాటువాదులు, తీవ్రవాదులు, హింసను సమర్థించే వ్యక్తులకు ఇచ్చే స్థలంపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఈ ఘటన ఇరు దేశాల మధ్య సంబంధాలకు మంచిది కాదని భారత్ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ వివాదాస్పద బ్రాంప్టన్ కార్యక్రమం నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని చాండియన్ పార్లమెంటేరియన్ చంద్ర ఆర్య డిమాండ్ చేశారు.

అగ్ని ప్రైమ్ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం విజయవంతం.. డీఆర్ డీవో ను అభినందించిన రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్

లిబరల్ పార్టీకి చెందిన చంద్ర ఆర్య తన ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేసిన వీడియోలో వివాదాస్పద శకటం గురించి మాట్లాడుతూ.. ‘‘కెనడాలో ఖలిస్తాన్ మద్దతుదారులు ఇటీవల బ్రాంప్టన్ పరేడ్ లో హేయమైన ఫ్లోట్ తో కొత్త స్థాయికి చేరుకున్నారు. భారత ప్రధాని ఇందిరాగాంధీ హత్యను చిత్రీకరిస్తూ.. రక్తంతో తడిసిన తెల్లచీరలో ఆమె కటౌట్, హంతకులుగా మారిన బాడీగార్డుల కటౌట్లు, తుపాకులు చూపిస్తూ సంబరాలు చేసుకున్నారు’’ అని అన్నారు.

‘‘మన దేశం కెనడా అంటే ఇది కాదు. హింసను కీర్తించడాన్ని సహించడం, విద్వేషాన్ని బహిరంగంగా ప్రోత్సహించడం మన దేశం విశ్వసించే ప్రతి దానికి విరుద్ధం. ఖలిస్తాన్ మద్దతుదారులు హద్దులు దాటారు. కెనడా స్పందించాలి’’ అని ఆయన వ్యాఖ్యానించారు. 

హిజాబ్ వివాదం.. పాఠశాలల్లో మత మార్పిడికి పాల్పడితే ఊరుకోబోము - మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్

గతంలో హిందూ వ్యతిరేక, భారత వ్యతిరేక విద్వేషాలపై కెనడాను అప్రమత్తం చేశానని, స్పష్టమైన, దృఢమైన చర్యలు తీసుకోవాలని ఆర్య పిలుపునిచ్చారు. ‘భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక గ్రూపులు బాగా వ్యవస్థీకృతమైనవి. బాగా నిధులు సమకూర్చేవి, రాజకీయంగా బలమైనవి, మీడియా పరిజ్ఞానం కలిగినవి. ఇటీవలి కాలంలో హిందూ దేవాలయాలపై దాడులు, హిందూ కమ్యూనిటీ నాయకులు, హిందూ సంస్థలను లక్ష్యంగా చేసుకోవడం, హిందూ మత పవిత్ర చిహ్నమైన ఓంతో కూడిన జెండాలను బహిరంగంగా ప్రదర్శించడాన్ని వ్యతిరేకించడం వంటి చర్యలతో, ఈ సమూహాలు హిందూ కెనడియన్లకు భయంకరమైన సందేశాన్ని పంపుతున్నాయి’’అని ఆయన నొక్కి చెప్పారు. ద్వేషం భౌతిక హింసగా మారకముందే అధికారులు, కెనడా ప్రభుత్వం నిజమైన చర్యలు తీసుకోవాలని ఎంపీ చంద్ర ఆర్య పిలుపునిచ్చారు. 

ఈ ఘటనపై విదేశాంగ మంత్రి జైశంకర్ గురువారం స్పందిస్తూ.. ‘‘ఇందులో పెద్ద సమస్య ఉందని నాకు అనిపిస్తోంది. నిజం చెప్పాలంటే ఓటు బ్యాంకు రాజకీయాల అవసరాల కోసం ఇలా చేయడం సరైంది కాదని అన్నారు. వేర్పాటువాదులకు, తీవ్రవాదులకు, హింసను సమర్థించే వ్యక్తులకు ఇచ్చే స్థలం గురించి పెద్ద అంతర్లీన సమస్య ఉందని నేను భావిస్తున్నాను. ఇది సంబంధాలకు మంచిది కాదు.. కెనడాకు మంచిది కాదని నేను భావిస్తున్నాను’’ అని జైశంకర్ అన్నారు. 

కాగా.. భారత ప్రధానిగా పనిచేసిన ఇందిరాగాంధీ అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయం నుంచి ఉగ్రవాదులను ఏరివేసేందుకు 1984 జూన్ 1 నుంచి 10 వరకు ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ నిర్వహించారు. ఈ సైనిక చర్య ఇండియర్ ఆర్మీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ ఆపరేషన్ లో గణనీయమైన ప్రాణనష్టం సంభవించడంతో పాటు సిక్కు మతస్తులు పవిత్ర స్థలంగా భావించే గోల్డెన్ టెంపుల్ కు కూడా నష్టం వాటిల్లింది. ఆ తరువాత ఆమె 1984 అక్టోబర్ 31న న్యూఢిల్లీలోని ఆమె నివాసంలో బాడీ గార్డులతో ఆమె హత్యకు గురయ్యారు.