లండన్ రైల్వే స్టేషన్‌లో బాంబు.. హైఅలర్ట్

bomb Threat in London Railway station
Highlights

లండన్ రైల్వే స్టేషన్‌లో బాంబు.. హైఅలర్ట్

బ్రిటన్ రాజధాని లండన్‌లో సాయంత్రం జనం.. భద్రతా సిబ్బంది ఉరుకులు పరుగులు పెట్టారు. నగరంలోని చారింగ్ క్రాస్ రైల్వేస్టేషన్ ‌వద్ద ఓ వ్యక్తి తన వద్ద బాంబు ఉందని చెప్పి ప్రయాణికులను భయాందోళనకు గురిచేశాడు.. సమాచారం అందుకున్న పోలీసులు స్టేషన్ వద్దకు చేరుకుని అతడిని పట్టుకున్నారు.. ముందు జాగ్రత్త చర్యగా స్టేషన్‌ను ఖాళీ చేయించారు.. రైలు సర్వీసులు నిలిపివేశారు.. ఈ ఘటనలో ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు.. వీలైనంత త్వరగా స్టేషన్‌ను ప్రారంభిస్తమాని చెప్పారు.. కాగా.. బ్రిటన్‌లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో ఈ ఘటన జరగడం అందరిని ఉలిక్కిపడేలా చేసింది. 

loader