వాషింగ్టన్:  డెమోక్రటిక్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న జో బైడెన్ తో పాటు ఆయన శిబిరం ఎన్నికల్లో విజయంపై ధీమాగా ఉన్నారు. 

బైడెన్ సహా, ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న కమలా హరీస్ లు విజయం సాధిస్తారని ఆశాభావంతో ఉన్నారు.ఓట్ల లెక్కింపు జరుగుతుంది... లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే వరకు నిశ్శబ్దంగా ఉండాలని ఆయన కోరారు. తుది ఫలితం త్వరలోనే తేలుతుందని బైడెన్ చెప్పారు.

కరోనా వైరస్ పై గురువారం నాడు డెలావేర్ లోని విల్మింగ్ టన్ లో బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. బైడెన్ కు ఇప్పటివరకు 253 ఎలక్టోరల్ ఓట్లు దక్కాయి. సీఎన్ఎన్ అంచనాల ప్రకారంగా బైడెన్ 253 ఓట్లు వచ్చాయి. పెన్సిల్వేనియా, అరిజోన్, జార్జియా, నెవాడా రాష్ట్రాల్లో రెండు గెలిస్తే బైడెన్ కు అధ్యక్ష పదవి దక్కనుంది.

ప్రతి బ్యాలెట్ తప్పనిసరిగా లెక్కించాలి.. అదే మనం చూడబోతున్నామన్నారు. ఇప్పుడే వెళ్తున్నామని చెప్పారు. ప్రజాస్వామ్యం కొన్నిసార్లు గందరగోళంగా ఉంటుంది, దీనికి కొన్నిసార్లు ఓపిక కూడ అవసరమన్నారు. అయితే ఆ సహనానికి 240 ఏళ్లకు పైగా ప్రపంచానికి అసూయపడే పాలనా వ్యవస్థతో ప్రతిఫలం లభించిందన్నారు.

also read:అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2020: 120 ఏళ్లలో రికార్డ్ స్థాయి ఓటింగ్

జో బైడెన్ అధ్యక్ష పదవిని గెలుచుకొనే వేగంతో ఉన్నారని అతని క్యాంపెయిన్ నిర్వాహకుడు ఇహాద్ పేర్కొన్న కొద్ది గంటలకే బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అరిజోనా, జార్జియా, నెవాడా, పెన్సిల్వేనియా ఓట్లను లెక్కింపు పూర్తయ్యేవరకు సహనంతో ఉండాలని బైడెన్ వర్గం భావిస్తోంది.

అమెరికా తదుపరి అధ్యక్షుడిగా బైడెన్ అవుతారని తమ డేటా తెలుపుతోందని జెన్ ఓ మల్లీ డిల్లాన్ గురువారం నాడు చెప్పారు. ఓట్లను లెక్కించకుండా ఉండేందుకు రూపొందించిన వ్యూహాన్ని ట్రంప్ కొనసాగిస్తున్నారు.