వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రికార్డుల మీద రికార్డులు నెలకొన్నాయి. 120 ఏళ్లలో అత్యధిక పోలింగ్ శాతం నమోదైన ఎన్నికలుగా ఈ  ఎన్నికలు చరిత్ర సృష్టించింది.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అమెరికాలో 23.9 కోట్ల మందికి ఓటు హక్కు ఉంది. అయితే ఈ నెల 3వ తేదీన జరిగిన ఎన్నికల్లో సుమారు 16 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఇంకా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.  1900 ఎన్నికల్లో అత్యధికంగా 73.7 శాతం ఓట్లు నమోదయ్యాయి. 2016 ఎన్నికల్లో 56 శాతం పోలింగ్ నమోదైంది. 2008 ఎన్నికల్లో 58 శాతం ఓటింగ్ నమోదైంది.

ఈ ఏడాది ఇప్పటివరకు 66.9 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఏడాది మిన్నెసొటా, మైన్ లో అత్యధికంగా 79.2 శాతం పోలింగ్ నమోదైంది.

2020 అధ్యక్ష ఎన్నికల్లో 120 ఏళ్లలో అత్యధిక పోలింగ్ శాతం నమోదైందని యూఎస్ ఎలక్షన్ ప్రాజెక్టుకు నాయకత్వం వహిస్తున్న ఫ్లోరిడా విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్ అసోసియేట్ ప్రొఫెసర్ మైఖేల్ పి మెక్ డొనాల్డ్ చెప్పారు.

కొలరాడోలో 77.1శాతం, కన్నెక్టికట్ లో71.1 శాతం, డేల్ వారే లో 70.8 శాతం, ఫ్లోరిడాలో 72.9 శాతం, మేరీల్యాండ్ లో 72.2 శాతం, మాస్సాచూట్స్ లో 73.4 శాతం, మిచిగాన్ లో 73.5 శాతం, మోనాటాలో 72.3 శాతం ఓటింగ్ నమోదైంది.

also read:డోనాల్డ్ ట్రంప్‌నకు టీవీ చానెల్స్ షాక్:స్పీచ్ లైవ్ కట్

అర్కానాసాలో అత్యల్పంగా 56.1 శాతం ఓటింగ్ నమోదైంది. ఓటింగ్ లో అమెరికా అత్యంత చెత్త రికార్డును కలిగి ఉంది. ఓటింగ్ లో ప్రపంచంలోని 35 దేశాల్లో అమెరికా 30వ  స్థానంలో నిలిచిందని  వ్యూ రీసెర్స్ ర్యాకింగ్స్ ప్రకటించింది.

గురువారం నాడు మధ్యాహ్నం నాటికి బైడెన్ 2016లో హిల్లరీ క్లింటన్ కంటే అత్యధిక ఓట్లను పొందారు. 2016లో హిల్లరీకి దక్కిన ఓట్ల కంటే బైడెన్ కు అత్యధికంగా 8 మిలియన్ ఓట్లు ఎక్కువగా వచ్చాయి.

ట్రంప్‌నకు ఇప్పటివరకు 68.5 మిలియన్లకు పైగా ఓట్లు దక్కాయి. రిపబ్లికన్ పార్టీకి వచ్చిన అత్యధిక ఓట్లు కూడ ఇవే.