సూపర్ న్యూస్.. ధర తగ్గిన ఆడి కార్లు

Audi prices slashed by upto Rs 10 lakh: How much cheaper each car is now!
Highlights

రూ.10లక్షల వరకు తగ్గింపు

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ  ఆడి కార్ల ధరలు తగ్గాయి. భారత్‌లో వివిధ మోడళ్లపై శుక్రవారం భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. దాదాపు రూ.10లక్షల వరకు తగ్గింపు ధరల్లో కార్లను అందుబాటులోకి తెచ్చింది. ఎంపిక చేసిన మోడళ్లపై లిమిటెడ్ పీరియడ్ స్పెషల్ ప్రైస్ ఆఫర్‌ను ప్రకటించింది. మరోవైపు 2018లో కొనుగోలు చేసి.. ఈఎంఐ ఆఫర్‌తో 2019లో చెల్లించడం ప్రారంభించండని కూడా పేర్కొంది. 

ఎంపిక చేసిన మోడళ్లపై ఒరిజినల్ ధరపై రూ.2.74లక్షల నుంచి రూ.10 లక్షల వరకు తగ్గింపునిస్తోంది. ఆడీ ఏ3, ఆడీ ఏ4, ఆడీ ఏ6, ఆడీ క్యూ3 మోడళ్లపై ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. ఆడీ ఫ్యామిలీలో భాగస్వామ్యం కావాలనుకునే కస్టమర్ల కోసం పరిమిత కాలపు ఆఫర్‌ను ప్రకటించినట్లు ఆడీ ఇండియా సంస్థ వెల్లడించింది. 

డిస్కౌంట్ తరువాత కార్ల ధరలు ఈ విధంగా ఉన్నాయి.

ఏ3 మోడల్ కారు ధర రూ.33.1లక్షలు కాగా.. డిస్కౌంట్ తర్వాత రూ.27.99లక్షలకు లభ్యమౌతోంది. 
ఏ4 మోడల్ కారు ధర రూ.41.47లక్షలు కాగా.. ఆఫర్ తర్వాత రూ.35.99లక్షలకు అందుబాటులోకి వచ్చింది
ఏ6 మోడల్ కారు ధర రూ. 56.69లక్షలు కాగా.. డిస్కౌంట్ లో రూ. రూ.46.99లక్షలకే లభిస్తోంది.
క్యూ3 మోడల్ కారు ధర రూ.34.73లక్షలు కాగా.. డిస్కౌంట్ లో రూ. 31.99 లక్షలకు అందుబాటులో కి వచ్చింది.

loader