Asianet News TeluguAsianet News Telugu

అక్కడ కారు పార్క్ చేయాలంటే.. కోట్ల రూపాయలు పెట్టాల్సిందే..

న్యూయార్క్ లో ఓ ప్రాంతంలో కారు పార్కింగ్ ఇటీవల రూ.6 కోట్లకు అమ్ముడుపోయి అందర్నీ ఆశ్చర్యంలో ముంచేసింది. 

Parking Spot In New York City Cost At Least Rs 6 Crore
Author
First Published Nov 25, 2022, 8:13 AM IST

న్యూయార్క్ : నగరాల్లో కారు ఉండడం లగ్జరీనే.. కానీ దాని పార్కింగ్ విషయానికి వచ్చేసరికే తలనొప్పిగా మారుతుంది. ఇక మెట్రో నగరాల్లో అయితే ట్రాఫిక్ ను దాటుకుని చేరుకోవాల్సిన ప్రాంతాలకు చేరడం ఎంత కష్టమో చెప్పాల్సిన పని లేదు. ఆ తరువాత కారు పార్కు చేసేందుకు ప్లేస్ దొరకటం అంతకంటే పెద్ద కష్టం. వీటిపి దృష్టిలో పెట్టుకునే ఫ్రీగా ఇవ్వాల్సిన పార్కింగ్ కు వ్యాపార సముదాయాలు, కార్పొరేట్ కార్యాలయాలు, షాపింగ్ మాల్స్ స్పెషల్ ఫీ వసూలు చేస్తున్నాయి. ఈ ఫీజు నగరంలోని ఆయా ప్రాంతాల్లో ఉండే రద్దీని బట్టి మారిపోతూ ఉంటుంది. 

అయితే, ఎంత మారినా.. మాగ్జిమం గంటకు వందో, రెండొందలో ఉండొచ్చు అంతకు మించి ఉండదు కదా..అదికూడా ఎక్కువే అనుకుంటున్నారా.. అయితే మీరు అమెరికాలోని అత్యంత ఖరీధైన న్యూయార్క్ నగరంలో పార్కింగ్ ప్లేస్ కోసం చెల్లించాల్సిన ధర తెలుసుకోవాల్సిందే. ఇది తెలుసుకుని షాక్ అవ్వాల్సిందే. అక్కడ ఇటీవలే 16 మిలియన్ డాలర్ల ఖరీధైన అపార్ట్మెంట్ లోని పార్కింగ్ లాట్.. చాలా సింపుల్ గా ఏడున్నర లక్షల డాలర్లకు మాత్రమే  అమ్ముడయినట్లు సీఎన్ బీసీ ఓ వార్తా కథనంలో పేర్కొంది.  

అమెరికాలో ఊడుతున్న ఉద్యోగాలు.. హెచ్1బీ వీసా భారతీయులకు సాయం చేయడంపై యూఎస్ దృష్టి

అంటే అది మన కరెన్సీలో దాదాపు రూ. ఆరు కోట్ల రూపాయలు అన్నమాట. ఇంత రేటు పెట్టినా ఈ పార్కింగ్ లాట్ నేల మీద పార్క్ చేసేది కాదు. ఈ పార్కింగ్ ప్లేస్ లో కార్లను పైకి లిఫ్ట్ చేసి క్యాబిన్ లలో పెడతారు. దీనికి సంబంధించిన ఆటోమేటిక్ పార్కింగ్ సిస్టమ్ కోసమే ఇంత భారీగా డబ్బు చెల్లించినట్లు సమాచారం. ఇక్కడే కాదండోయ్.. నగరంలోని మిగతా ఖరీదైన నివాస ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి. కారు పార్కింగ్ చేయాలంటే సుమారు 5 లక్షల డాలర్ల నుంచి ఆరు లక్షల డాలర్ల వరకూ చెల్లించాలట. ఈ మేరకు సీఎన్ బీసీనే తన కథనంలో పేర్కొంది.

అంటే సుమారు మూడు కోట్ల నుంచి ఐదు కోట్ల రూపాయలు అన్నమాట. కారు పార్కింగ్ కు పెట్టే ఆ డబ్బులుతో మన దగ్గర ఓ పదిమంది మధ్యతరగతి వాల్లు ఏకంగా ఇల్లే కొనేసుకోవచ్చు. ఖరీదైన ప్రాంతాల్లోనే కాదు సాధారణ ప్రదేశాల్లో కారు పార్కింగ్ చేయాలన్నా.. అక్కడ కనీస ధర మూడు లక్షల డాలర్లు గా ఉందట. ఈ విషయాన్ని న్యూయార్క్ కు చెందిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థ తెలిపింది. పరిస్థితి ఇంతలా మారిపోవడానికి కారణం నగరంలో కార్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండడమే  అని పేర్కొంది. బ్లూమ్బర్గ్  నివేదిక ప్రకారం న్యూయార్క్ లో నిరుడుతో పోలిస్తే ఈ యేడు 224 శాతం మేర  కార్ల సంఖ్య పెరిగింది. ఈ కారణంగానే ఇళ్ల ధరలతో పాటు కారు పార్కింగ్ ధరలు కూడా పోటాపోటీగా పెరుగుతున్నాయని తెలిపింది. 

Follow Us:
Download App:
  • android
  • ios