దారుణం.. 15 మంది మగ పిల్లలపై ఇద్దరు టీచర్ల అత్యాచారం..

15 మంది విద్యార్థులపై ఇద్దరు ఉపాధ్యాయులు దారుణానికి ఒడిగట్టారు. చదువుకునేందుకు వచ్చిన పిల్లలపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో జరిగింది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Atrocious.. Rape of 15 male children by two teachers..ISR

15 మంది మగ పిల్లలపై ఇద్దరు టీచర్లు దారుణానికి ఒడిగట్టారు. విద్యార్థులకు చదువు చెప్పి, సమాజంలో ఎలా మెలగాలో బోధించే ఉపాధ్యాయుల బుద్ధి గడ్డి తిన్నది. తమ వద్దకు చదువుకోవడానికి వచ్చి బాలురపై స్కూల్ లోనే లైంగిక దాడికి ఒడిగట్టారు. ఈ ఘటన పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

caste census : కుల గణన దేశానికి ఒక ఎక్స్ రే.. దానిని కాంగ్రెస్ చేపడుతుంది - రాహుల్ గాంధీ..

‘ది ప్రింట్’ కథనం ప్రకారం.. అది పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్. లాహోర్ కు 275 కిలోమీటర్ల దూరంలోని చక్వాల్ జిల్లాలోని సెమినారీలో ఓ స్కూల్ ఉంది. అందులో జీషాన్, అనీస్ అనే ఇద్దరు ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. వారిద్దరూ కొంత కాలంగా చదువుకునేందుకు వచ్చిన 10 నుంచి 12 ఏళ్ల మధ్య వయసున్న 15 మంది విద్యార్థులపై లైంగిక దాడికి పాల్పడుతున్నారు. 

అయితే గత శుక్రవారం ఆ స్కూల్ లోని చదువుతున్న ఓ పిల్లాడిని కలిసేందుకు తండ్రి వచ్చాడు. తండ్రిని చూడగానే బాధిత బాలుడు ఏడ్చాడు. ఏమైందని ఆరా తీయగా.. ఇద్దరు టీచర్లు తనపై చేసిన అత్యాచారం, చిత్రహింసల కథను వివరించాడు. వాళ్ల చేతిలో మరి కొందరు విద్యార్థులు కూడా లైంగిక దాడికి గురయ్యారని వివరించాడు. దీంతో ఆ తండ్రి పంజాబ్ పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణాలు వెలుగులోకి వచ్చాయి.

తెలంగాణలో రైతులకు బ్యాడ్ న్యూస్.. నిధుల విడుదలకు అడ్డు చెప్పిన ఎలక్షన్ కమిషన్

ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసు బృందం ఆ సెమినరీపై దాడి చేసింది. ఇద్దరు ఉపాధ్యాయులను అరెస్టు చేసి, బాధితుల వాంగ్మూలాలను రికార్డు చేసింది. అనంతరం పంజాబ్ ఫోరెన్సిక్ సైన్స్ ఏజెన్సీ బృందం సంఘటనా స్థలాన్ని సందర్శించి డీఎన్ఏ నమూనాలను సేకరించిందని జిల్లా పోలీసు అధికారి కెప్టెన్ (రిటైర్డ్) వాహిద్ మెహమూద్ ‘డాన్’ వార్తాపత్రికకు తెలిపారు. అయితే విద్యార్థులకు కత్తిపోట్ల గాయాలు ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించారు.

రోడ్లు బాగా లేవని వైసీపీని వద్దనుకోవద్దు.. రాజధాని వల్ల ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి - మంత్రి ధర్మాన

ఈ ఘటనపై పంజాబ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మొహ్సిన్ నఖ్వీ హామీ స్పందించారు. బాధిత కుటుంబాలకు తక్షణ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. హేయమైన నేరానికి నిందితులకు గరిష్ట శిక్ష పడుతుందని ఆయన తెలిపారు. ఈ దారుణానికి పాల్పడిన వారికి వీలైనంత త్వరగా శిక్ష పడేలా చూడాలని ఐజీపీ, ప్రాసిక్యూషన్ కార్యదర్శికి బాధ్యతలు అప్పగించినట్లు వెల్లడించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios