కెనడా ఇండియన్ రెస్టారెంట్ లో పేలుడు

కెనడా ఇండియన్ రెస్టారెంట్ లో పేలుడు

టోరంటో: కెనడాలోని టోరంటో శివారులోని మిస్సిసౌగా ప్రాంతంలోని ఓ ఇండియన్ రెస్టారెంట్లో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో దాదాపు 15 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వార్తలను బట్టి తెలుస్తోంది.

బొంబాయి భేల్ రెస్టారెంట్ పేలుడు ఘటనలో గాయపడిన 15మందిని ఆస్పత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ మేరకు పీల్ రీజినల్ పారామెడిక్ సర్వీస్ ట్వీట్ చేసింది.

పేలుడు గురువారం రాత్రి 10.30 గంటలకు సంభవించింది. దానికి కారణం ఏమిటనేది తెలియదు. సంఘటన జరిగిన తర్వాత ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయినట్లు చెబుతున్నారు. 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM INTERNATIONAL

Next page