బ్రెజిల్ ను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. గత వారం ప్రారంభమైన ఈ వర్షాలు ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు. దీంతో చాలా చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో అనేక ప్రాంతాల్లో రోడ్లు బ్లాక్ అవ్వడంతో పాటు పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. వర్షాల వల్ల బ్రెజిల్ లో ఇప్పటి వరకు 106 మంది చనిపోయారు.
బ్రెజిల్ లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. దిగువ ప్రాంతాలు నీటితో మునిగిపోతున్నాయి. ఎంతో మంది నిరాశ్రయులువుతున్నారు. ముఖ్యంగా ఈశాన్య బ్రెజిల్ లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొండచరియలు విరిగిపడటం, వదర నీటి ప్రభావంతో తీవ్ర ప్రాణ నష్టం జరుగుతోంది. ఇప్పటి వరకు ఈ వరదల వల్ల 106 మంది మృతి చెందారు.
బ్రెజిల్ లో ఈ వర్షాల వల్ల పెర్నాంబుకో అత్యధికంగా ప్రభావితమైంది. ఇక్కడ అనేక చోట్ల కొండ చరియలు విరిగిపడటంతో రాష్ట్ర రాజధాని రెసిఫ్ లో ఇళ్లు దెబ్బతిన్నాయి. గల్లంతైన వ్యక్తులను గుర్తించడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎఎఫ్ బీ నివేదిక ప్రకారం.. మే 28న వరదనీరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రవహించడంతో పదుల సంఖ్యలో ప్రజలు మరణించారు. దాదాపు 14 మంది గల్లంతు అయ్యారని రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారులు పేర్కొన్నారు.
Nepal plane crash: భార్యభర్తలుగా విడిపోయినా.. మృత్యు ఒడిలోకి ఒక్కటిగా..
వర్షాల వల్ల పెర్నాంబుకోలోని సుమారు 24 మున్సిపాలిటీలు అత్యవసర పరిస్థితిని ప్రకటించాయి. రాష్ట్రంలో 6,000 మందికి పైగా ఇళ్లు కోల్పోయారు. బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో పరిస్థితిని సమీక్షించారు. సోమవారం బోల్సోనారో తాను హెలికాప్టర్లో విపత్తు ప్రాంతం మీదుగా ఎగురుతున్న వీడియోను పోస్ట్ చేశారు. ‘‘ నేను దిగడానికి ప్రయత్నించాను. కానీ హెలిక్యాప్టర్ కిందకు దించే పరిస్థితి లేదని, నేల అస్థిరంగా ఉందని చెప్పారు. హెలిక్యాప్టర్ కిందకి దిగితే ప్రమాదం జరుగుతుందని చెప్పారు. కాబట్టి మా నిర్ణయాన్ని విరమించుకున్నాం’’ అని తెలిపారు.
Singer KK : బాలీవుడ్ సింగర్ కేకే గురించి ఎవరికీ తెలియని వాస్తవాలు..
గత వారం ఈ ప్రాంతంలో వర్షాలు ప్రారంభమయ్యాయి. వారాంతంలో ఈ వర్షం తీవ్రతరం కావడంతో ఈ ప్రాంతంలో వరదలు, కొండచరియలు విరిగిపడ్డాయి. నివేదికల ప్రకారం.. పెర్నాంబుకోలో శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం కురిసిన వర్షంతో కలుపుకొని మొత్తంగా మే నెలల 70 శాతం వర్షపాతం నమోదైంది. కాగా ఈశాన్య బ్రెజిల్ లో వరదలకు వాతావరణ మార్పులే కారణమని నిపుణులు భావిస్తున్నారు. బ్రెజిల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన, హింసాత్మక వర్షాలు పెరగడానికి వాతావరణ మార్పు కారణం కావచ్చని నేషనల్ సెంటర్ ఫర్ నేచురల్ డిజాస్టర్ మానిటరింగ్ అండ్ అలర్ట్స్ రీసెర్చ్ కోఆర్డినేటర్ జోస్ మారెంగో చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రియో డి జనీరో రాష్ట్రంలోని పెట్రో పోలిస్ నగరంలో వరదలు, కొండచరియలు విరిగిపడటంతో 233 మంది చనిపోయారు. ఈ ఏడాది ప్రారంభంలో ఆగ్నేయ బ్రెజిల్ లో కుండపోత వర్షాల కారణంగా దాదాపు 28 మంది ప్రాణాలు కోల్పోయారు.
బ్రెజిల్‌లో వరదల కారణంగా ఎక్కడ చూసినా జలమయమైన దృశ్యాలే కనిపిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఎటు చూసినా బురద ప్రవాహాలు.. రోడ్డు మార్గాలను కప్పివేశాయి. కొండ చరియలు విరిగిపడిన బురద ప్రవాహం కారణంగా దాదాపు 28 మంది ప్రాణాలు కోల్పోయారని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ప్రజల రక్షణ కోసం చర్యలు తీసుకుంటున్నామనీ, భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు తెలుపుతున్నారు.
