మహిళ కుర్తాపై ఖురాన్ కు విరుద్ధంగా అరబిక్ రాతలు.. దాడికి దిగిన యువకులు.. మహిళా పోలీసు చేసిన పనితో.. (వీడియో)

అరబిక్ ప్రింట్లతో కూడిన కుర్తా ధరించినందుకు దాడికి గురైన మహిళను పాక్‌లో  పోలీసులు రక్షించారు.

Arabic writings contrary to Quran on woman's kurta, Mob attack, saved by women police (Video) - bsb

న్యూ ఢిల్లీ : పాకిస్తాన్ లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ మహిళపై గుంపు అటాక్ చేసింది.  అది గమనించిన మహిళా పోలీసు ఆమెను కాపాడారు. ఇంతకీ విషయం ఏంటంటే ఆ మహిళా ధరించిన కుర్తాపై అరబిక్ లో రాతలున్నాయి. అవి అరబిక్ భాషలో ఖురాన్ ను కించపరిచేలా ఉన్నాయని ఓ గుంపు చుట్టుముట్టింది. ఇది పాకిస్తాన్లోని లాహోర్లో వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గుంపు చుట్టుముట్టడంతో భయంతో ఆ యువతి తన ముఖాన్ని కనిపించకుండా చేతులు అడ్డం పెట్టుకుంది.

ఆ మహిళను కాపాడిన మహిళా పోలీసును ఉద్దేశించి పాకిస్తాన్లోని పంజాబ్ పోలీసులు ఈ వీడియోలు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దీని మీద మహిళా పోలీసు మాట్లాడింది. ఆ మహిళ ధరించిన దుస్తుల మీద అరబిక్ లో ఏవో పదాలు రాసి ఉన్నాయి. ఆమె తన భర్తతో షాపింగ్కు వచ్చింది. ఆమె కుర్తాను చూసిన కొంతమంది.. వెంటనే ఆమె దగ్గరికి వచ్చి కుర్తాను తీసేయాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలో గందరగోళం నెలకొంది.

నడిరోడ్డుపై మహిళను వేధించిన వ్యక్తి: బుద్ది చెప్పిన ప్రయాణీకులు, సోషల్ మీడియాలో వైరల్

దాడి జరిగే అవకాశం ఉందనిపించి ఆ మహిళను కాపాడాను అని చెప్పుకొచ్చారు. ఆ మహిళ తనకు ఖురాన్ ను కించపరిచే ఉద్దేశం ఏమీ లేదని, డిజైన్ బాగుందని దానిని కొన్నానని చెప్పారని…కూడా ఆ మహిళా పోలీస్ తెలిపింది. అయితే ఆ మహిళ ధరించిన దుస్తుల మీద కురాన్ ను కించపరిచేలా రాతలు ఏమీ లేవని సోషల్ మీడియాలో కొంతమంది అంటున్నారు.  

ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదురవుతున్నాయి. పాకిస్తాన్లో ఇటీవలి కాలంలో మతం పేరుతో మాబ్ లించింగ్  పెరిగిపోయిందన్నారు. రాజకీయాల కోసమే ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

మహిళపై దాడికి ప్రయత్నించిన గుంపును శాంతింపజేయడానికి ప్రయత్నించిన మహిళా అధికారిని పోలీసులు ప్రశంసించారు. మహిళను రెస్టారెంట్ నుండి బయటకు తీసుకువెళ్లారు. సదరు వీడియోలో... సైదా షెహర్బానో నఖ్వీ అనే ఆ పోలీసు ఎటువంటి హింసకు పాల్పడవద్దని ప్రజలను కోరడం కనిపిస్తుంది. "మహిళ తన భర్తతో కలిసి షాపింగ్‌కు వచ్చింది. ఆమె కుర్తాపై  కొన్ని పదాలు రాసి ఉన్నాయి. వాటిని చూసిన కొందరు కుర్తాను తీసివేయమని ఆమెను కోరారు. దీంతో గందరగోళం ఏర్పడింది" అని నఖ్వీ చెప్పారు.

పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లిన తర్వాత మహిళ మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు క్షమాపణలు చెప్పింది. "ఎవరి మతపరమైన మనోభావాలను కించపరిచే ఉద్దేశం నాకు లేదు. కుర్తా మంచి డిజైన్ ఉన్నందువల్లే కొన్నాను" అని ఆ మహిళ చెప్పిందని తెలిపారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios