Asianet News TeluguAsianet News Telugu

తండ్రి తాగొచ్చి తల్లిని రోజూ కొడుతున్నాడని ఎస్సైకి ఫిర్యాదు చేసిన తొమ్మిదేళ్ల బాలుడు.. ఎక్కడంటే ?

తన తండ్రి తాగి వచ్చి తల్లిని కొడుతున్నాడని తొమ్మిదేళ్ల బాలుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆ దంపతులను పోలీసు స్టేషన్ కు పిలిపించారు. కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఇది ఏపీలోని బాపట్ల జిల్లాలో చోటు చేసుకుంది. 

A nine-year-old boy who complained to the SI that his father was beating his mother every day due to drunkenness.. Where is he?..ISR
Author
First Published May 5, 2023, 9:17 AM IST

ఆ బాలుడికి తొమ్మిదేళ్లు. తండ్రి రోజూ తాగొచ్చి తల్లిని కొడుతున్నాడు. ఇది ఆ బాలుడి పసి మనస్సును గాయపర్చింది. తండ్రి తీరుపై ఆ బాలుడికి కోపం వచ్చింది. తల్లి బాధపడటం చూసి ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే స్థానిక పోలీసు స్టేషన్ కు వెళ్లాడు. అక్కడ ఎస్ఐని కలిసి తండ్రి తీరును వివరించాడు. తండ్రిపై ఫిర్యాదు చేశాడు. ఇది ఏపీలోని బాపట్ల జిల్లాలో చోటు చేసుకుంది.

ఆబ్కారీ మంత్రికి అసలు నీరా అంటే ఏంటో తెలుసా - ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాపట్ల జిల్లాలోని కర్లపాలెం మండలంలోని పాత ఇస్లాంపేటకు చెందిన సుభానీ వడ్ల మిల్లులో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. దీంతో పాటు కుట్టుపని కూడా చేస్తుంటాడు. ఆయనకు పది సంవత్సరాల కిందట పెళ్లి జరిగింది. భార్య పేరు సుభాంబీ. ఈ దంపతులకు ఓ కుమారుడు రహీమ్ ఉన్నాడు. వయస్సు 9 సంవత్సరాలు.

కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్ లో సిరిసిల్లా వాసి మృతి.. బోయినపల్లి మండలం మల్కాపూర్ లో మిన్నంటిన రోదనలు

అయితే కొంత కాలం నుంచి సుభానీ ప్రవర్తనలో మార్పు వచ్చింది. ప్రతీ రోజూ తాగి ఇంటికి వచ్చి, రాత్రి సమయంలో తన భార్యను కొడుతుండేవాడు. శారీరకంగా హింసకు గురి చేసేవాడు. ఇది తరచూ జరుగుతుండటంతో కుమారుడు రహీమ్ తట్టుకోలేకపోయాడు. తన తండ్రిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసు స్టేషన్ కు వెళ్లి ఎస్సైకు ఫిర్యాదు చేశారు. తన తండ్రిని మందలించాలని కోరాడు. అతడి నుంచి వివరాలు మొత్తం తెలుసుకున్న ఎస్సై.. బాలుడి తల్లిదండ్రులను పోలీసు స్టేషన్ కు పిలిపించారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. భార్యపై చేయి చేసుకోకూడదని ఎస్సై సుభానీకి సూచించారు. మళ్లీ ఇలాంటివి జరిగితే చట్ట ప్రకారం కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తరువాత వారిని ఇంటికి పంపించివేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios