ఓ 80 ఏళ్ల వృద్ధుడు 60 ఏళ్లుగా నిద్రలేకుండా జీవిస్తున్నాడు. అయినప్పటికీ ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. 1962 నుంచి ఇప్పటి వరకు ఆయన నిద్రపోవడాన్ని ఎవరూ చూడలేదు. ఆ వృద్ధుడు ఎవరు ? ఆయనకు ఏమైంది ? ఎందుకు నిద్రపోవడం లేదనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి మరి..

వియత్నాంకు చెందిన 80 ఏళ్ల వృద్ధుడు దాదాపు 60 సంవత్సరాలుగా నిద్రపోవడం లేదు. అయినా ఆయన ఎలాంటి అనారోగ్యానికి గురి కాకుండా జీవిస్తున్నాడు. ఈ విషయం వైద్యులకు తెలియడంతో అక్కడికి చేరుకొని పరీక్షించి ఆశ్చర్యపోయారు. అసలు నిద్రపోకుండా వృద్ధుడు ఎలా బతుకుతున్నాడని వారికి కూడా అంతుబట్టలేదు.

అర్ధరాత్రి అన్యూహ పరిణామాలు..సెంథిల్ బాలాజీ తొలగింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న తమిళనాడు గవర్నర్

ఆ వృద్ధుడి పేరు థాయ్ ఎన్గోక్. చిన్నతనంలో అంటే 1962లో ఆయనకు ఒక సారి జ్వరం వచ్చింది. ఇక అప్పటి నుంచి ఆయనకు నిద్రపట్టడం లేదు. సుమారు 60 ఏళ్లు గడిచినా ఇంకా నిద్రపోకుండానే జీవిస్తున్నారు. థాయ్ ఎన్గోక్ నిద్రపోవడాన్ని కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఇరుగుపొరుగు ఎప్పుడూ చూడలేదు. అనేక మంది వైద్య నిపుణులు అతని పరిస్థితిని పరీక్షించారు. అయితే వారిలో ఎవరూ ఆయన విశ్రాంతి తీసుకున్నారని నిరూపించలేకపోయారు.

కాగా.. ఈ థాయ్ ఎన్జోక్ నిద్రలేమితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే దాదాపు 60 ఏళ్లుగా నిద్రపోకుండ ఉన్నప్పటికీ ఆయన ఎలాంటి అనారోగ్యానికి గురికాలేదు. ఈయన గురించి తెలుసుకున్న ఓ య్యూటబర్ డ్రూ బిన్స్కీ ఎన్నో వ్యయ ప్రయాసలు పడి థాయ్ ను చేరుకున్నారు. ఆయనతో సంభాషించారు. ఈ సంభాషణకు సంబంధించిన వీడియోను తన ఛానెల్ లో అప్ లోడ్ చేశారు.

YouTube video player

తాను చాలా ఏళ్ల కిందట థాయ్ ఎన్గోక్ గురించి మొదటిసారి విన్నానని, మా నాన్న పుట్టిన సంవత్సరం నుంచి ఆయన ఒక్క సారి కూడా కన్నులు మూయలేదనని తెలిసింది. అందుకే ఆయనతో మాట్లాడేందుకు అరిజోనా నుండి దక్షిణ వియత్నాంలోని ఒక చిన్న గ్రామానికి 2 రోజులు పాటు ప్రయాణించి వచ్చానని తెలిపారు. 1955 నుంచి 1975 వరకు సాగిన యుద్ధంలో ఎన్గోక్ చేతికి గాయమైందని యూట్యూబర్ డ్రూ చెప్పారు. ఆ యుద్ధం వల్ల ఏర్పడిన పీటీఎస్డీ (దిగ్భ్రాంతికరమైన, భయానకమైన, ప్రమాదకరమైన ఘటనను అనుభవించిన కొంతమంది వ్యక్తులలో అభివృద్ధి చెందే రుగ్మత) కారణంగా ఆయనకు నిద్రరావడం లేదేమో అని తెలిపారు.

ఘోర రోడ్డు ప్రమాదం.. వేగంగా వచ్చి ట్రక్కును ఢీకొన్న కారు.. ఆరుగురు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు

ఆ యూట్యూబర్ ఎన్గోక్ తో రాత్రంతా గడిపాడు. కానీ ఆయన నిద్రపోలేదు. అయితే తెల్లవారుజామున 4 గంటలకు పడుకోవడానికి ప్రయత్నించినా.. అది సాధ్యం కాలేదని యూట్యూబర్ గుర్తించారు. ‘‘ఎన్గోక్ సాధారణ మనిషిలాగే నిద్రపోవాలని కోరుకుంటాడు. కానీ ఆయన నిద్రపోలేడు.’’ అని చెప్పారు. కాగా ఈ వీడియోను చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘‘బేసిక్ గా ఈ మనిషికి భూమ్మీద ఎక్కువ సమయం దొరికింది’’ అని ఓ యూజర్ కామెంట్ చేశారు. 

చారిత్రాత్మకం.. తొలిసారిగా తెలుగులో తీర్పు వెలువరించిన తెలంగాణ హైకోర్టు.. ఏ కేసులో అంటే ?

మరో యూజర్ ‘‘ఆయన నిద్ర లేకుండా మామూలుగా ఎలా పని చేస్తున్నాడనేది ఆసక్తికరంగా ఉంది. కొన్ని సార్లు కేవలం రెండు గంటలు మాత్రమే పడుకున్నా.. అది మామూలు వ్యక్తికి సరిపోదు. అయితే ఆయన శరీరం బలహీనంగా, తేలికగా అనిపిస్తుంది. అదే సమయంలో ఆశ్చర్యంగానూ, బాధాకరంగానూ ఉంది. మీరు (యూట్యూబర్ డ్రూ) చెప్పింది నిజమే కావచ్చు. యుద్ధం ఆయనను ఇలా చేసింది. కానీ ఆయన ఇప్పుడు నిద్రపోవాలనుకుంటున్నాడు. అయితే ఈ వయస్సులో ముఖ్యంగా హాయిగా నిద్రపోవడానికి ఆయన అర్హుడు’’ అని తెలిపారు. మరో యూజర్ ‘‘మనిషి మేల్కొనే సమయాన్ని బట్టి చూస్తే ఈ వ్యక్తి ఇప్పటివరకు జీవించి ఉన్న అత్యంత వృద్ధుడు. ప్రపంచంలో అందరికంటే ఎక్కువ జీవితాన్ని గడిపాడు.’’ అని కామెంట్ చేశారు.