అమెరికాలో పనిచేయాలనుకునే విదేశీయులకు శుభవార్త : 15 వేల హెచ్-2బీ వీసాలు అదనంగా జారీ

american government announces 15000 additional visas foreign workers
Highlights

ఇదివరకు జారీచేసిన 66 వేలకు ఇవి అదనం

అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీయులకు అమెరికా ప్రభుత్వం శుభవార్త అందించింది. వీసాల జారీని కఠినతరం చేసి విదేశీ ఉద్యోగుల వలసలను ఆపేసి ముప్పుతిప్పలు పెట్టిన ట్రంప్ ప్రభుత్వం వాస్తవాలను గుర్తించి వెనుకడుగు వేయాల్సి వచ్చింది. 2018 సంవత్సరానికి జారీ చేసిన 66 వేల వీసాలకు అదనంగా మరో 15 వేల వీసాలను కూడా జారీ చేయనున్నట్లు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యురిటీ ప్రకటించింది. దీంతో అమెరికా వెళ్లాలని ఉవ్విళ్లూరే ఇండియన్స్ కి మరింత అవకాశం అభించినట్లయింది.

సాధారణంగా హెచ్-2బీ వీసాలను నాన్ అగ్రికల్చర్ వర్కర్లల కోసం అందిస్తుంటారు. అంటే వ్యాపారులు తవమ వ్యాపారాభివృద్ది కోసం నిపుణులైన విదేశీయులను ఈ వీసా ద్వారా అమెరికాకు రప్పించుకోవచ్చన్న మాట. దీంతో అటు వ్యాపారులు లాభపడతారు. అయితే దేశీయ నిరుద్యోగిత పెరుగుతున్న నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వం ఈ వీసాల జారీని కఠినతరం చేసింది.

అయితే అమెరికాలో వివిధ పరిశ్రమలలో పనిచేయడానికి అనుభవం, ప్రతిభ కలిగిన ఉద్యోగులు లేరని సెక్రటరీ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యురిటీ సంస్థ తెలిపింది. సెక్రటరీ ఆఫ్‌ లేబర్‌ అలెక్సాండర్‌ అకోస్టా, కాంగ్రెస్‌ సభ్యులు, వ్యాపార యజమానులతో సమావేశమైన ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈ సంస్థ తెలిపింది. ఇందుకోసం హెచ్‌-2బీ వీసాలను ప్రత్యేకంగా రూపొందించినట్లు తెలిపారు. 

ఈ సంవత్సరం రెండు విడతల్లో ఈ వీసాలు జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ వారం నుంచి అర్హత కలిగిన వారు హెచ్‌-2బీ వీసాల కోసం ఫామ్‌ 1-129ను సమర్పించాలని తెలియజేశారు.
 

loader