Asianet News TeluguAsianet News Telugu

నేనే అధ్యక్షుడినైతే ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని 24 గంటల్లో ఆపేసేవాడిని: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను అధికారంలో ఉండి ఉంటే 24 గంటల్లో ఉక్రెయిన్, రష్యా యుద్ధాన్ని ఆపేసేవాడనిని తెలిపారు.
 

america former president donald trump says if i were president could put an end to ukraine russia war within 24 hours
Author
First Published Jan 28, 2023, 4:49 AM IST

న్యూఢిల్లీ: గతేడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్ దేశంపై రష్యా సైనిక చర్యను మొదలు పెట్టింది. రష్యా మాట్లాడేవారిని తాము కాపాడుకుంటామని, ఎట్టి పరిస్థితుల్లో వారి హక్కులన్నీ కాపాడుతామని,అందుకే మిలిటరీ ఆపరేషన్ అని ఆమె వివరించారు. సుమారు ఏడాది గడుస్తున్నప్పటికీ యుద్ధంతో దుర్భర పరిస్థితులను చవిచూస్తున్నారు. ఈ సందర్భంగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అధ్యక్షుడినైతే ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని గంటల వ్యవధిలోనే ఆపేసేవాడిన అని తెలిపారు.

చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవచ్చని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తాను అధికారంలో ఉండి ఉంటే యుద్దాన్ని 24 గంటల్లో పూర్తి చేసేవాడినని వివరించారు. ఇప్పటికీ తాను అధ్యక్షుడినైతే చర్చల ద్వారా ఈ భయానక ఉత్పాతాన్ని గంటల్లో ముగించేసేవాడని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు డొనాల్డ్ ట్రంప్ తన సొంత సోషల్ మీడియా సైట్ ట్రుత్ సోషల్‌లో పోస్టు చేశారు.

గతేడాది ఫిబ్రవరి 24వ తేదీన ఉక్రెయిన్ పై రష్యా దాడులకు తెగబడింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు దాడులు చేస్తూనే ఉన్నది. తాజాగా, క్షిపణులతో విరుచుపడుతున్నది. కాగా, ఉక్రెయిన్ వెంట అమెరికా,యూకే, ఫ్రాన్స్, ఇతర కొన్ని యూరప్ దేశాలు బలంగా నిలబడ్డాయి. ఉక్రెయిన్‌కు ఆయుధ సహాయం అందించడానికి ఇవి ఇప్పటికే సిద్ధపడ్డాయి. పలు వెపన్స్‌ కూడా ఉక్రెయిన్‌కు అందించాయి. 

Also Read: "హార్ట్‌బ్రేకింగ్ ట్రాజెడీ": ఉక్రెయిన్ ఛాపర్ క్రాష్‌పై బిడెన్ విచారం

కాగా, ఉక్రెయిన్ పశ్చిమ దేశాల నుంచి ఎడంగా జరగాలని, అది మొత్తం రష్యాకే ప్రమాదకరం ని పుతిన్ అన్నారు. ముఖ్యంగా నాటోలో చేరనే చేరవద్దని రష్యా స్పష్టం చేసింది. కానీ, రష్యా విన్నతులను ఉక్రెయిన్ ఖాతరు చేయడం లేదు.

Follow Us:
Download App:
  • android
  • ios