Asianet News TeluguAsianet News Telugu

"హార్ట్‌బ్రేకింగ్ ట్రాజెడీ": ఉక్రెయిన్ ఛాపర్ క్రాష్‌పై బిడెన్ విచారం 

ఉక్రెయిన్ హెలికాప్టర్ క్రాష్: ఉక్రెయిన్‌లో భారీ హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఉక్రెయిన్ అంతర్గత మంత్రి మరణించారు. దీంతో హెలికాప్టర్ ప్రమాదంలో మొత్తం 18 మంది చనిపోయారు. హెలికాప్టర్ పాఠశాల సమీపంలో పడిపోయింది, అందులో కొంతమంది పిల్లలు కూడా మరణించారు. ఈ ఘటనపై అమెరికా ప్రధాని విచారం వ్యక్తం చేశారు. 

Heartbreaking Tragedy: Biden Expresses Grief Over Ukraine Chopper Crash
Author
First Published Jan 19, 2023, 4:57 AM IST

ఉక్రెయిన్‌లో భారీ హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ఇందులో హోం మంత్రి డెనిస్ మొనాస్టిర్స్కీ సహా పలువురు ఉన్నతాధికారులు మరణించారు. ఈ ప్రమాదంలో మొత్తం 18 మంది మృతి చెందినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. రాజధాని కైవ్ శివార్లలో ఈ ప్రమాదం జరిగింది. ఉక్రెయిన్ రాజధాని కైవ్ వెలుపల బోవరీ సమీపంలోని పాఠశాల సమీపంలో హెలికాప్టర్ కూలిపోయిందని ఆ ప్రాంత గవర్నర్ చెప్పారు. సంఘటన తర్వాత, ఈ ప్రమాద వీడియోలు నెట్టింట్లో తెగ వైరలవుతున్నాయి. దీనిలో సంఘటన స్థలంలో అరుపులు వినిపిస్తున్నాయి. చుట్టూ మంటలు వ్యాపించడం ఈ వీడియో చూడవచ్చు. 

"బ్రోవరీ పట్టణంలోని కిండర్ గార్టెన్ , నివాస భవనం సమీపంలో హెలికాప్టర్ కూలిపోయింది" అని కైవ్ ప్రాంతీయ పరిపాలన అధిపతి ఒలెక్సీ కులేబా  టెలిగ్రామ్‌లో తెలిపారు. ఘటన జరిగినప్పుడు పిల్లలు, పాఠశాల సిబ్బంది కూడా అక్కడే ఉన్నారు. వీటిలో కొంత మంది చనిపోయారు కూడా. పోలీసులు, వైద్య సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఉక్రెయిన్ పోలీసు చీఫ్ ఇగోర్ క్లెమెన్కో మాట్లాడుతూ, 'ప్రస్తుతం హెలికాప్టర్ ప్రమాదంలో 18 మంది మరణించారు. మరణించిన వారిలో ఉక్రెయిన్ అంతర్గత మంత్రి డెనిస్ మొనాస్టైర్స్కీ కూడా ఉన్నారు.


హోం మంత్రి మరణం

మృతుల్లో తొమ్మిది మంది హెలికాప్టర్‌లో ఉన్నారని పోలీసులు తెలిపారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన 10 మందిని ఆస్పత్రికి తరలించారు. స్థానిక టీవీ ఛానెల్ కథనం ప్రకారం, కిండర్ గార్టెన్ సమీపంలో నిలబడి ఉన్న వ్యక్తి కూడా ప్రమాదంలో మరణించాడు. ఉక్రెయిన్‌కు పెద్ద దెబ్బేమీ కాదన్న ఈ ఘటన యుద్ధం మధ్యలో జరిగింది. ఇది ప్రమాదమా లేక కుట్ర జరిగిందా అనే విషయంపై ఉక్రెయిన్ ఇంకా ఏమీ చెప్పలేదు. రాజధాని కీవ్‌కు ఈశాన్యంగా 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రోవరీలో ఈ ప్రమాదం జరిగింది. యుద్ధం ప్రారంభంలో, ఈ ప్రాంతంపై రష్యా మరియు ఉక్రేనియన్ దళాల మధ్య పెద్ద యుద్ధం జరిగింది. తరువాత ఏప్రిల్‌లో రష్యా సైన్యం వెనక్కి తగ్గింది.

అమెరికా అధ్యక్షుడి విచారం 

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ బుధవారం కైవ్ సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన డజనుకు పైగా వ్యక్తుల కుటుంబాలకు సంతాపం తెలిపారు, రష్యా దాడి మధ్య ఉక్రెయిన్‌తో యునైటెడ్ స్టేట్స్ యొక్క "అవిఫలమైన భాగస్వామ్యాన్ని" పునరుద్ఘాటించారు. ఈ హృదయ విదారక విషాదానికి సంతాపం వ్యక్తం చేస్తూ.. చింతిస్తున్నామని  బిడెన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు, ప్రమాదంలో మరణించిన ఉక్రెయిన్ అంతర్గత మంత్రి డెనిస్ మొనాస్టైర్స్కీని "సంస్కర్త మరియు దేశభక్తుడు" అని పిలిచారు.

ప్రమాదంపై విచారణ 
ఉక్రెయిన్ సాయుధ దళాల వైమానిక దళ కమాండ్ ప్రతినిధి యూరి ఇగ్నాట్ మాట్లాడుతూ..ఈ ప్రమాదం గురించి ఏదైనా చెప్పడం చాలా తొందరగా ఉంది. ప్రమాదంపై కమిషన్ విచారణ జరుపుతుంది. హెలికాప్టర్‌లో లోపం వల్ల ప్రమాదం జరిగిందా లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో కమిషన్ విచారణ జరుపుతుంది. ఇది విమాన ప్రమాదం కాబట్టి, దానిని నివేదించడానికి సమయం పడుతుంది. అంతర్గత మంత్రి డెనిస్ మొనాస్టిర్స్కీ మరణించడం బాధకరం.తనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2021లో ఆయన ఉక్రెయిన్ హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

జెలెన్స్కీ జర్మన్ అధ్యక్షుడితో మాట్లాడారు

జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్ స్టెయిన్‌మీర్‌తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రక్షణ అంశాలపై చర్చించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్‌కీ తెలిపారు. జెలెన్స్కీ మంగళవారం ఒక టెలిగ్రామ్‌లో మాట్లాడుతూ, సంభాషణ సందర్భంగా వారు ఉక్రెయిన్‌లోని ఫ్రంట్‌లైన్‌లోని పరిస్థితి గురించి మరియు కైవ్‌కు రక్షణ మద్దతును పెంచాల్సిన అవసరం గురించి మాట్లాడారు. ఉక్రేనియన్ మిలిటరీ సామర్థ్యాలను బలోపేతం చేసినందుకు , కైవ్‌కు మానవతా మరియు ఆర్థిక సహాయం అందించినందుకు స్టెయిన్‌మీర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఉక్రేనియన్ ప్రెసిడెంట్ చెప్పారు, జిన్హువా వార్తా సంస్థ నివేదించింది.

Follow Us:
Download App:
  • android
  • ios