పాకిస్థాన్ లో విషాదం చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలడంతో మూడు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఏడుగురు మరణించారు. మరో 10 మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులు ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.
గ్యాస్ సిలిండర్ పేలడంతో మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఏడుగురు మరణించారు. మరో పది మందికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లోని జీలంలో ఆదివారం చోటు చేసుకుంది. బిల్డింగ్ బేస్మెంట్ లో ఉన్న సిలిండర్ దుకాణంలో పేలుడు సంభవించడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు జీలం జిల్లా పోలీసు అధికారి నాసిర్ మెహమూద్ బజ్వా తెలిపారని ‘డాన్’ నివేదించింది.
అజిత్ పవార్ కు ఎదురుదెబ్బ.. శరద్ పవార్ వర్గానికి తిరిగొచ్చిన మరో ఎన్సీపీ ఎమ్మెల్యే..
ఆదివారం ఉదయం 9.45 గంటలకు జరిగిన ఈ ఘటనలో శిథిలాల నుంచి 16 మందిని వెలికితీశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. భవనం కూలడంతో జిల్లా కేంద్ర ఆసుపత్రిలో అత్యవసర పరిస్థితి విధించారు. మృతుల కుటుంబాలకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సంతాపం తెలిపారు.
ఇటీవల పాకిస్థాన్ లోని పంజాబ్ లోని సర్గోధా జిల్లాలో ఓ వాహనంలోని గ్యాస్ సిలిండర్ పేలి ఏడుగురు మృతి చెందారు. జూన్ నెలలో దేశవ్యాప్తంగా జరిగిన మూడు వేర్వేరు గ్యాస్ సిలిండర్ పేలుళ్లలో ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు.
