న్యూయార్క్ సిటీలో ఓ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో 80 మందికి గాయాలు అయ్యాయి. వీరిలో చాలా మందికి ఎముకలు విరిగాయి. మరికొందరికి తలకు గాయాలు అయ్యాయి.
న్యూయార్క్ లోని మాన్ హట్టన్ లో డబుల్ డెక్కర్ టూర్ బస్సు సిటీ కమ్యూటర్ బస్సును ఢీకొట్టింది. రెప్పపాటులో జరిగిన ఈ ప్రమాదంలో 80 మందికి గాయాలు అయ్యాయి. మెట్రోపాలిటన్ ట్రాన్స్ పోర్టేషన్ అథారిటీ నడుపుతున్న బస్సు వెనుక భాగాన్ని ఢీకొనడంతో డబుల్ డెక్కర్ టాప్వ్యూ టూర్ బస్సు ముందు అద్దాలు పగిలిపోయాయి.
ఆ సేవకు ఫలితం.. నిత్యానంద 'కైలాస' దేశానికి ప్రధానిగా నటి రంజిత !
మన్ హట్టన్ తూర్పు వైపున ఉన్న ఫస్ట్ అవెన్యూ, 23వ స్ట్రీట్ వద్ద రాత్రి 7 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. రెండు బస్సులు రద్దీగా, ప్రయాణికులతో నిండి ఉన్నాయని న్యూయార్క్ అగ్నిమాపక శాఖ తెలిపింది. ప్రమాద స్థలంలో సుమారు 63 మందిని వైద్య సిబ్బంది పరీక్షించినట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనలో గాయపడ్డ చాలా ఎముకలు విరిగాయి. తలకు, మెడకు తీవ్రగాయాలు అయ్యాయి. వారిప్పుడు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. అగ్నిమాపక శాఖ డిప్యూటీ చీఫ్ పాల్ హూపర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటనలో అనేక మందికి గాయాలైనప్పటికీ అవేవీ ప్రాణాంతకం కావని తెలిపారు.
కాగా.. ఈ ప్రమాదంలో గాయపడిన ఇష్రక్ జహాన్ అనే ప్రయాణికుడు ‘సీబీసీ న్యూస్’తో మాట్లాడుతూ.. ‘‘ఒక్క సారిగా నా పక్కన మహిళ గట్టిగా అరిచింది. ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు. అదే సమయంలో ఓ బస్సు మా వైపు దూసుకురావడాన్ని గమనించాను. క్షణాల్లోనే అంతా జరిగిపోయింది. తరువాత ఎక్కడ చూసినా గాజు ముక్కలే కనిపించాయి. ఇదంతా ఓ సినిమాలో చూపించినట్టుగా అనిపించిది. కొంత సమయం తరువాత అక్కడక్కడ రక్తం కనిపించింది. నేను వెంటనే 911కు ఫోన్ చేశాను.’’ అని అన్నారు.
