ఫ్రాన్స్‌లో ఒక ఉపాధ్యాయుడిని టీనేజ్ స్టూడెంట్ కత్తితో పొడిచి హత్య చేశాడు. 

ఫ్రాన్స్‌ : నైరుతి ఫ్రాన్స్‌లోని ఒక పాఠశాలలో బుధవారం ఒక టీనేజ్ స్టూడెంట్ క్లాస్మధ్యలో ఉపాధ్యాయురాలిని కత్తితో పొడిచి చంపినట్లు ప్రాంతీయ ప్రాసిక్యూటర్ తెలిపారు. బాధితురాలు, ఆగ్నెస్ లస్సాల్లే (52), సెయింట్-జీన్-డి-లుజ్‌లోని ఓ పాఠశాలలో స్పానిష్ క్లాస్ చెబుతున్నప్పుడు 16 ఏళ్ల యువకుడు కత్తితో ఆమెపై దాడి చేసినట్లు ప్రాసిక్యూటర్ తెలిపారు.

దీనిమీద ప్రత్యక్ష సాక్షి అయిన ఓ విద్యార్థి మాట్లాడుతూ.. "అతను తన సీట్లో నుంచి లేవడం నేను చూడలేదు, కానీ టీచర్ ముందు సడెన్ గా ఉండడం చూశాను" అని అన్నారు. "ఆ సమయంలో అతను చాలా ప్రశాంతంగా ఉన్నాడు. టీచర్ తో ఏమీ మాట్లాడలేదు. తన దగ్గరున్న పెద్ద కత్తితో ఆమె ఛాతిలో పొడిచాడు’ అని ఆమె చెప్పింది. 

ఘటనా స్థలంలో ఉపాధ్యాయురాలికి అత్యవసర సహాయం అందించారు. ఆ తరువాత గాయాల కారణంగా ఆమె మరణించింది. టీచర్ మీద దాడి చేసిన ఆ విద్యార్థిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అతను ఇంతకు ముందు నేర చరిత్ర ఉన్న వ్యక్తి కాదని తెలిపారు. లస్సాల్ భాగస్వామి బ్రాడ్‌కాస్టర్ మాట్లాడుతూ.. "చాలా అందమైన, చాలా మంచి వ్యక్తి, అందరూ ఇష్టపడే వ్యక్తి" అని చెప్పారు. "సెలవు రోజుల్లో కూడా ఆమె పని చేయడానికి ఇష్టపడేది.. అంతగా తన ఉద్యోగానికి అంకితమయ్యేది..’ అని చెప్పాడు.

ఇజ్రాయెల్ వెస్ట్ బ్యాంక్ లో కాల్పులు.. 10 మంది పాలస్తీనియన్లు మృతి.. అనేక మందికి గాయాలు

దాడి చేసిన స్టూడెంట్ 10 సెంటీమీటర్ల (దాదాపు 4 అంగుళాలు) పొడవు గల బ్లేడ్‌ని తనతో తీసుకొచ్చాడని చూసినవారు తెలిపారు. అతనికి ఎలాంటి ఆగ్రహం కానీ, ఉగ్రవాదలింకులు కానీ లేనట్టున్నాయని.. కాకపోతే క్షణికావేశంలో చేసినట్టుగా తోస్తుందని పోలీసులు భావిస్తున్నారు. దాడిని ప్రత్యక్షంగా చూసిన విద్యార్థిని, తనకు నిజంగా ఆ యువకుడి గురించి తెలియదని చెప్పింది.

"స్పానిష్ క్లాస్‌లో కలిసి ఉంటాం. కానీ క్లాస్‌లో అతనికి, టీచర్‌కి మధ్య ఎప్పుడూ.. ఏ సమస్యా లేదు" ఆమె చెప్పింది. ఈ ఘటన మీద ప్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ట్విట్టర్‌లో ‘కత్తిపోటు ఘటనతో చాలా కలత చెందాను" అని సంతాపం తెలిపారు. "దేశం మీ పక్షాన ఉంది" అంటూ ఆమె కుటుంబానికి హామీ ఇచ్చారు.

గురువారం మధ్యాహ్నం 3:00 గంటలకు ఫ్రాన్స్ లోని అన్ని పాఠశాలలు ఆమె కోసం ఒక నిమిషం మౌనం పాటిస్తాయని ఫ్రాన్స్ విద్యా మంత్రి పాప్ ఎన్డియాయే తెలిపారు. అతని మానసిక స్థితి, ఉద్దేశాలను గుర్తించడం కోసం విచారణ జరిగింది. అతని నేపథ్యానికి సంబంధించిన వివరాలేవీ తెలియలేదు. 

పాఠశాలల్లో ఇటువంటి దాడులు సాధారణంగా ఫ్రాన్స్‌లో అరుదుగా జరుగుతాయి. అయితే, ఉపాధ్యాయుల భద్రత గురించి ఆందోళనలు పెరుగుతూనే ఉన్నాయి. గత 40 ఏళ్లలో పాఠశాలల్లో డజనుకు పైగా ఘోరమైన దాడులు జరిగాయి. 2020 అక్టోబర్‌లో పారిస్ వెలుపల శామ్యూల్ పాటీని ఇస్లామిస్ట్ రాడికల్ తల నరికి చంపిన తర్వాత సెయింట్-జీన్-డి-లూజ్‌లో జరిగిన దాడిలో ఫ్రాన్స్‌లో ఒక ఉపాధ్యాయుడిని హత్య చేయడం ఇదే మొదటిది.

జూలై 2014లో, దక్షిణ పట్టణమైన అల్బీలో 34 ఏళ్ల ఉపాధ్యాయుడిని ఓ విద్యార్థి తల్లి కత్తితో పొడిచి చంపింది. 2012లో టౌలౌస్ పరిసరాల్లో ఇస్లామిస్ట్ ముష్కరుడు మొహమ్మద్ మెరాహ్ అనే వ్యక్తి ఒక యూదు పాఠశాల లక్ష్యంగా జరిపిన దాడుల్లో ఒక ఉపాధ్యాయుడు, ముగ్గురు విద్యార్థులను కాల్చి చంపారు.