నన్ను జైల్లో పెడితే..రూ.2కోట్లు ఇస్తానంటున్న వ్యాపారి

First Published 7, Jul 2018, 10:13 AM IST
A night in Mandela's prison cell - yours for $300,000
Highlights

జైలు జీవితం కావాలని కోరుకుంటున్న వ్యాపారి.. ఆ జైలు ప్రత్యేకత ఏంటో తెలుసా?

జైలు జీవితం గడపాలని ఎవరైనా కోరుకుంటారా చెప్పండి. జైలు శిక్ష పడినవారే దాని నుంచి ఎలా తప్పించుకోవాలా అని చూస్తుంటారు. అలాంటిది ఓ వ్యాపారి మాత్రం తాను ఒక రోజు రాత్రి జైల్లో గడుపుతానని.. అందుకు బదులుగా రూ.2కోట్లు కూడా ఇస్తానని చెబుతున్నాడు.

డబ్బుులు ఇచ్చి మరీ అతను జైలు జీవితం గడపానికి చాలా పెద్ద కారణమే ఉంది. ఏంటంటే.. ఆ జైలుకి ఓ ప్రాముఖ్యత ఉంది.  దక్షణాఫ్రికా జాతి వివక్ష వ్యతిరేక యోధుడు నెల్సన్ మండేలా 18 ఏళ్లు శిక్ష అనుభవించిన జైలు అది. రాబెన్ ఐలాండులో ఉంది. ఖైదీల సంక్షేమం, ఇతర సామాజిక సేవా కార్యక్రమాల కోసం ఆయన గడిపిన 7వ నంబరు జైలు గదిని వేలం వేశారు.

 ఏడాదికి ఒక రోజు ఆ గదిలో నివసించే ఆఫర్ అన్నమాట. దీన్ని దక్కించుకోవడానికి చాలామంది పోటీ పడుతున్నారు. ఓ వ్యక్తి అత్యధికంగా రూ. 2 కోట్లు కోట్ చేశాడు. వేలం ఈ నెల 16వరకు ఉంటుంది. వేలంలో పాల్గొన్న వారిని జైల్లోని ఇతర గదుల్లో ఒక రోజు నిద్రపోతారు. మండేలా జైలు గది ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో ఉంది.

ఇదండీ అసలు మ్యాటర్.. అందుకే ఆ జైలు గదిలో గడిపేందుకు అంతలా పోటీ పడుతున్నారు.

loader