ఆడు మగాడ్రా బుజ్జీ..!! 12మంది భార్యలు, 102మంది పిల్లలు.. ఇప్పుడిక పిల్లలొద్దట.. !!
ఉగాండాలో ఓ వ్యక్తి ఏకంగా 12మందిని పెళ్లి చేసుకున్నాడు. అంతేనా వీరితో 102మంది పిల్లల్ని కన్నాడు. ఇప్పుడిక వారిని పోషించలేకపోతున్నానని.. పిల్లలు వద్దు అనుకుంటున్నాడట.

ఉగాండా : ఉగాండాలో ఓ వ్యక్తి పెళ్లిళ్లు, అతని పిల్లలు ఇప్పుడు వార్తల్లోకి ఎక్కి, చర్చనీయాంశంగా మారారు. క్రికెట్ టీంకంటే ఓ ఎక్స్ ట్రా ప్లేయర్ అదనంగా ఉన్న భార్యలు.. సెంచరీని దాటి దూసుకుపోతున్న పిల్లల సంఖ్యతో అతని గురించి తెలుసుకున్నవారంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఆ వ్యక్తి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 మందిని పెళ్లి చేసుకున్నాడు. ఇక పిల్లల విషయానికి వస్తే ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టాల్సిందే.. ఈ 12 మంది భార్యలతో అతనికి 102 మంది పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మాత్రం ఇంకా పిల్లలు వద్దు బాబోయ్ అంటూ చేతులెత్తేస్తున్నాడు.
ఇంత ఘనకార్యం సాధించిన సదరు పెద్దమనిషి పేరు మూసా హసస్య. ఉగాండా నివాసి. ఇంతకీ అతనికి ఉన్న ఆస్తిపాస్తులు ఎంత అనుకుంటున్నారు? 2 ఎకరాల భూమి. ఈ 102 మంది పిల్లలు, 12 మంది భార్యలు, అతనికి.. మొత్తం ఆ రెండు ఎకరాల భూమి ఆధారం. ఈ చిన్న ఆస్తితో అతను ఇంతమందికి దుస్తులు, సరిపోయేంత ఆహారం సంపాదించలేకపోతున్నాడు. తిండి పట్టా సరిగా లేకపోవడంతో ఇద్దరు భార్యలు ఇటీవలే విసుగు చెంది ముసాను విడిచిపెట్టి వెళ్లిపోయారు.
పెంపుడు జంతువులకు దేవుడి ఆశీర్వాదం కోసం చర్చికి పోటెత్తిన జనం.. వైరల్ వీడియో ఇదే
ఈ వివాహాలు.. పిల్లల విషయంలో ముసా మాట్లాడుతూ ‘పెద్దల మాటలు విని.. వంశాభివృద్ధి కోసం 12 మందిని పెళ్లి చేసుకున్నాను. 102 మంది పిల్లల్ని కన్నాను. 1972లో నా 17 ఏళ్ల వయసులో మొదటి పెళ్లి చేసుకున్నాను. పెళ్లయిన సంవత్సరానికే మొదటి బిడ్డకు తండ్రిని అయ్యాను. ఆమె పేరు సాండ్రా నాబ్వైర్’ అని చెప్పుకొచ్చాడు.
ఈ 12 మంది భార్యల్లో చిన్నదైన 12వ భార్య వయసు 35 సంవత్సరాలు. ఇక ముసా హసహ్య పిల్లల్లో అన్ని రకాల వయసు వారు ఉన్నారు. పదేళ్ల నుంచి 50 ఏళ్ల వయసువారు ఉండడం గమనించవచ్చు. ఇంట్లో ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువ పిల్లలు ఉంటేనే సందడిగా ఉంటుంది. అలాంటిది 102మంది పిల్లలు.. అది రకరకాల వయసు వారు ఉంటే ఆ సందడి వేరుగా ఉంటుంది. ఇక హసహ్యకు తన 102మంది పిల్లల్లో చాలామంది పేర్లు గుర్తు కూడా ఉండవట.
ఇద్దరికి మించి పిల్లలు ఉంటే పేరు మర్చిపోవడం మామూలుగా మగవాళ్ళ విషయంలో ఎక్కడైనా జరిగేది. అలాంటిది 102మంది పిల్లలు ఉంటే.. వారి పేర్లు మరిచిపోవడం అత్యంత సహజమైన విషయం గానే పరిగణించొచ్చు. అతను తన పిల్లల పేర్లు గుర్తించడంలో.. వారి వారి తల్లుల సహకారం తీసుకుంటానని కూడా చెప్పుకొచ్చాడు.