Asianet News TeluguAsianet News Telugu

చైనాలో భారీ అగ్నిప్రమాదం.. 38 మంది మృతి.. పలువురికి గాయాలు

చైనాలో సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో 38 మంది చనిపోయారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై స్థానిక ప్రభుత్వం విచారణ జరుపుతోంది. 

A huge fire in China.. 38 people died.. Many people were injured
Author
First Published Nov 23, 2022, 9:58 AM IST

సెంట్రల్ చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ వాణిజ్య సంస్థలో ఒక్క సారిగా మంటలు చెలరేగడంతో దాదాపు 38 మంది మరణించారు. పలువురికి గాయాలు అయ్యాయి. హెనాన్ ప్రావిన్స్‌లోని అన్యాంగ్ నగరంలోని వెన్‌ఫెంగ్ జిల్లాలోని ప్లాంట్‌లో చెలరేగిన మంటలను ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బందికి నాలుగు గంటలకు పైగా సమయం పట్టిందని స్థానిక అధికారులు తెలిపారు.

వివాదంలో యువరాజ్ సింగ్.. నోటీసులు జారీ చేసిన గోవా టూరిజం శాఖ..

ఈ ఘటన సోమవారం రాత్రి సమయంలో చోటు చేసుకోగా.. దాదాపు 11 గంటల సమయంలో మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. ఈ ఘటనలో గాయపడిన వ్యక్తులను చికిత్స నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. ఈ మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు 240 మంది అగ్నిమాపక సిబ్బంది కష్టపడ్డారు. 63 అగ్నిమాపక యంత్రాల సాయంతో మంటలను ఆర్పివేశారు.

చైనా ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ మంత్రిత్వ శాఖ కూడా ఘటనా స్థలానికి ఒక బృందాన్ని పంపిందని నివేదికలు పేర్కొన్నాయి. ఘటనపై స్థానిక పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. విచారణ కోసం పోలీసులు కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

ఇండోనేషియా భూకంపం: 268కు పెరిగిన మృతుల సంఖ్య, శిథిలాల కింద కూరుకుపోయిన గ్రామాలు

చైనాలోని టియాంజిన్ పోర్ట్‌లోని ఒక గోదాంలో 2015 ఆగష్టులో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 170 మందికి పైగా మరణించారు. 700 మంది గాయపడ్డారు. ఈ గోదాంలో 700 టన్నుల సోడియం సైనైడ్‌తో పాటు పెద్ద మొత్తంలో విష రసాయనాలు నిల్వ చేసి ఉంచడమే ఈ ప్రమాదానికి కారణం. చైనాలో తరచుగా అగ్నిప్రమాదాలు జరుగుతుంటాయి. పారిశ్రామిక నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటాయి.

Follow Us:
Download App:
  • android
  • ios