నేపాల్ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు భారతీయులు చనిపోయారు. వీరంతా రాజస్థాన్ కు చెందిన వారు. వీరు నేపాల్ లో యాత్ర కోసం బస్సులో ప్రయాణిస్తుండగా.. అది గురువారం తెల్లవారుజామున బారాలోని చురియామై సమీపంలో లోయలో పడిపోయింది.

నేపాల్ లోని బారా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరింది. భారత యాత్రికులతో వెళ్తున్న ఓ బస్సు గురువారం తెల్లవారుజామున లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు భారతీయులుతో పాటు మరొకరు నేపాల్ కు చెందిన వ్యక్తి మరణించారు. ఈ ప్రమాదంలో 19 మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులు ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.

డబ్ల్యూఎఫ్ఐ కు షాక్. సభ్యత్వం రద్దు చేసిన యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్.. కారణమేంటంటే ?

భారతీయ యాత్రికులతో కూడిన బస్సు ఖాట్మండు నుంచి జనక్ పూర్ వెళ్తుండగా బారాలోని చురియామై సమీపంలో తెల్లవారు జామున 2 గంటల సమయంలో 50 మీటర్ల లోయలో పడిపోయింది. మృతుల్లో మహోత్తరి జిల్లా లోహర్ పట్టికి చెందిన ఒక నేపాలీ, రాజస్థాన్ కు చెందిన ఆరుగురు భారతీయులు ఉన్నారు. ప్రమాదానికి గురైన ఈ బస్సులో డ్రైవర్లు, ఒక హెల్పర్ సహా మొత్తం 27 మంది ప్రయాణికులు ఉన్నారని డిప్యూటీ సూపరింటెండెంట్ ప్రదీప్ బహదూర్ ఛెత్రి తెలిపారు.

Scroll to load tweet…

కాగా.. ఈ ఘటనలో ఇద్దరు బస్సు డ్రైవర్లను, ఒక హెల్పర్ ను నేపాల్ లా ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వారికి జనక్ పూర్ లో వైద్య చికిత్స అందించిన అనంతరం అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని స్థానిక పోలీసు అధికారులు చెప్పారు. 

కులులో భారీగా విరిగిపడిన కొండచరియలు.. పేక మేడల్లా కూలిన భవనాలు.. వీడియో వైరల్

అయితే డ్రైవర్ అలసిపోయి, నిద్రలోకి జారిపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. కాగా.. ఈ ఘటనలో గాయపడిన వారందరూ ప్రస్తుతం మక్వాన్పూర్ జిల్లాలో ఉన్న హెటౌడాలోని పలు హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు.