కరాచీలో వడదెబ్బ: 65 మంది మృత్యవాత

65 people dead due to heat wave in Karachi
Highlights

పాకిస్తాన్ ను ఎండలు, వేడి గాలులు భయపెడుతున్నాయి. గత మూడురోజుల్లో కరాచీలో వడదెబ్బకు 65 మంది మృత్యువాత పడ్డారు. 

కరాచీ: పాకిస్తాన్ ను ఎండలు, వేడి గాలులు భయపెడుతున్నాయి. గత మూడురోజుల్లో కరాచీలో వడదెబ్బకు 65 మంది మృత్యువాత పడ్డారు. ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. దాంతో వడదెబ్బ మృతుల సంఖ్య పెరగవచ్చునని అంటున్నారు. 
ఓ వైపు రంజాన్‌ మాసం కావడంతో ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయి. పగటి పూట ప్రజలు ఉపవాసాలుంటున్నారు. ఈ మాసంలో పగటిపూట పచ్చి మంచినీళ్లు కూడా ముట్టరు. అటువంటి వారిపై ఉష్ణోగ్రతల ప్రభావం ఎక్కువగా ఉంది. 

సోమవారం ఉష్ణోగ్రత 44 డిగ్రీలగా ఉంది. ఇక్కడి కోరంగి, సోహ్రబ్‌గాత్‌లోని ఈదీ ఫౌండేషన్‌ మార్చురీలకు 3రోజుల్లో 114 మృతదేహాలు రాగా...అందులో 65మంది వడదెబ్బకు మృతిచెందినట్లు తెలుస్తోంది.

మమాలు రోజుల్లో కోరంగి మార్చురీకి ఆరు లేదా ఏడు మృతదేహాలు వృస్తాయి. గత కొద్ది రోజులుగా 20 నుంచి 25 మృతదేహాలు వస్తున్నాయి. అయితే, కరాచీలో వడదెబ్బకు మరణాలను సంభవిస్తున్నాయనే వార్తలను సింధు ఆరోగ్య కార్యదర్శి డాక్టర్ ఫజలుల్లా పెచుహో ఖండిస్తున్నారు. 

loader