సారాంశం
బ్రిటన్‌లోని పాఠశాలల్లో హిందూ వ్యతిరేక జాత్యహంకారం నిజం బట్టబయలైంది. బ్రిటన్‌లో హిందూ ద్వేషంపై హెన్రీ జాక్సన్ సొసైటీ చేసిన మొదటి అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగుచూశాయి.
బ్రిటన్‌లోని పాఠశాలల్లో హిందూ వ్యతిరేక జాత్యహంకారం నిజం బట్టబయలైంది. బ్రిటన్‌లో హిందూ ద్వేషంపై హెన్రీ జాక్సన్ సొసైటీ చేసిన మొదటి అధ్యయనంలో 51 శాతం మంది హిందూ పిల్లల తల్లిదండ్రులు వారి పిల్లలు పాఠశాలల్లో హిందూ వ్యతిరేక ద్వేషాన్ని అనుభవించారని నివేదించారు. అయితే భారతీయ విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో ఒక శాతం కంటే తక్కువ మంది గత ఐదేళ్లలో హిందూ వ్యతిరేక సంఘటనలను నివేదించారు. 19 శాతం మంది హిందూ తల్లిదండ్రులు పాఠశాలలు హిందూ వ్యతిరేక ద్వేషాన్ని గుర్తించగలవని నమ్ముతున్నారు. 15 శాతం మంది హిందూ తల్లిదండ్రులు పాఠశాలలు హిందూ-వ్యతిరేక సంఘటనలను తగినంతగా పరిష్కరిస్తాయని భావిస్తున్నారు.
ఇక, హెన్రీ జాక్సన్ సొసైటీ అనేది యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఉన్న ట్రాన్స్-అట్లాంటిక్ ఫారిన్ పాలసీ, నేషనల్ సెక్యూరిటీ థింక్ ట్యాంక్. ఈ నివేదికలో 998 మంది హిందూ తల్లిదండ్రుల తమ అభిప్రాయాలను వెల్లడించారు. డిపార్ట్‌మెంట్ ఫర్ ఎడ్యుకేషన్ జనాభా లెక్కల ద్వారా దక్షిణాసియా విద్యార్థులు ఉన్నట్లు గుర్తించిన అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సమాచార స్వేచ్ఛ అభ్యర్థనలు పంపబడ్డాయి.
ఈ అధ్యయనం బ్రిటన్‌లోని పాఠశాలల్లో హిందూ విద్యార్థులపై వివక్ష ప్రాబల్యాన్ని పరిశీలించింది. బ్రిటీష్ పాఠశాలలపై హిందూ పిల్లల తల్లిదండ్రులు చాలా విమర్శలు చేశారని నివేదికలో పేర్కొన్నారు. హిందూ మతంపై బోధించడం హిందూ విద్యార్థుల పట్ల మతపరమైన వివక్షను పెంపొందిస్తున్నట్లు అధ్యయనంలో పాల్గొన్న కొందరు చెప్పినట్టుగా నివేదిక పేర్కొంది.
బ్రిటన్ పాఠశాలల్లో హిందూ పిల్లలు బహుళ దేవుళ్లను ఆరాధించడం వల్ల వారిని ఎగతాళి చేస్తున్నారని కొందరు తల్లిదండ్రులు తెలిపినట్టుగా నివేదిక వెల్లడించింది. ‘‘ఈ నివేదిక బ్రిటీష్ పాఠశాలల్లో హిందువులపై వివక్ష యొక్క ప్రాబల్యాన్ని హైలైట్ చేస్తుంది. 51 శాతం మంది హిందూ తల్లిదండ్రులు తమ బిడ్డ పాఠశాలలో హిందూ వ్యతిరేక ద్వేషానికి గురయ్యారని నివేదించారు. పాఠశాలల్లో హిందూ అనుభవం గురించి మరింత అవగాహన, బ్రిటన్ తరగతి గదులలో వ్యక్తమయ్యే ఇతర తక్కువ తెలిసిన పక్షపాతాలపై మరింత పరిశోధన చేయవలసిన తక్షణ అవసరాన్ని ఈ పరిశోధనలు నొక్కి చెబుతున్నాయి. అటువంటి సంఘటనలను సంగ్రహించడానికి నిర్దిష్టమైన, కచ్చితమైన రిపోర్టింగ్ మెకానిజమ్‌ల అవసరాన్ని ఇది హైలైట్ చేస్తుంది’’ అని నివేదిక పేర్కొంది.
గతేడాది ఆగస్టు చివరలో దుబాయ్‌లో జరిగిన ఆసియా కప్‌లో భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ నేపథ్యంలో లీసెస్టర్‌లో హిందూ, ముస్లిం వర్గాల మధ్య చెలరేగిన హింసాకాండను విశ్లేషించిన సమయంలో పాఠశాలలపై తాను దృష్టి సారించినట్టుగా నివేదిక రచయిత షార్లెట్ లిటిల్‌వుడ్ తెలిపారు.