ట్యునీషియాలోని స్ఫాక్స్ నుండి గురువారం ఉదయం పడవ బయలుదేరింది. ఆ తరువాత కొన్ని గంటలకే పడవబోల్తా పడి మునిగిపోయింది. దీంట్లో నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు.
రోమ్ : సెంట్రల్ మెడిటరేనియన్‌లో గత వారం జరిగిన ఓడ ప్రమాదంలో 41 మంది వలసదారులు మరణించారు. ఈ మేరకు ఇటాలియన్ ద్వీపం లాంపెడుసాకు ప్రాణాలతో చేరుకున్నవారు తెలిపిన వివరాల ప్రకారం ఇదితెలిసిందని అక్కడి వార్తా సంస్థ బుధవారం నివేదించింది.
ఓడ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాద సమయంలో ముగ్గురు పిల్లలతో సహా 45 మంది పడవలో ఉన్నారని రెస్క్యూ సిబ్బంది చెప్పారని మీడియా సమాచారం.
శిశువు ఏడుపు ఆపడానికి పాల బాటిల్ లో మద్యం నింపిన తల్లి.. అరెస్ట్..
వలసదారుల సంక్షోభానికి హాట్ స్పాట్ గా మారిన ట్యునీషియాలోని స్ఫాక్స్ నుండి గురువారం ఉదయం పడవ బయలుదేరింది. ఆ తరువాత కొన్ని గంటలకే పడవబోల్తా పడి మునిగిపోయిందని ప్రాణాలతో బయటపడిన వారు చెప్పారు.
ప్రాణాలతో బయటపడిన వారిలో.. ఐవరీ కోస్ట్, గినియాకు చెందిన ముగ్గురు పురుషులు, ఒక మహిళ ఉన్నారు. వారిని కార్గో షిప్ ద్వారా రక్షించి, ఆపై ఇటాలియన్ కోస్ట్ గార్డ్ నౌకలోకి తరలించామని చెప్పారు. దీనికి సంబంధించి కోస్ట్ గార్డ్ ను వివరణ కోరగా వెంటనే స్పందించలేదు.
కోస్ట్ గార్డు ఆదివారం నివేదించిన రెండు ఓడ ప్రమాదాలతో అక్కడి మీడియా ఇచ్చిన వార్తకు సంబంధం ఉందా అనేది అస్పష్టంగా ఉంది, కోస్ట్ గార్డ్ ఇచ్చిన సమాచారంలో వాటిలో సుమారు 30 మంది తప్పిపోయినట్లు చెప్పారు.
మునిగిపోయిన పడవలలో ఒకటి గురువారం స్ఫాక్స్ నుండి బయలుదేరిందని మీడియా సమాచారం. కాగా, కోస్ట్ గార్డ్ కూడా 57 మంది ప్రాణాలు మృతి చెందారని.. రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు.
మరోవైపు ట్యునీషియా అధికారులు సోమవారం నాడు స్ఫాక్స్ సమీపంలో ఓడ ప్రమాదం నుండి 11 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారని, 44 మంది వలసదారులు ఇంకా ప్రాణాలతో ఉన్నారని తెలిపారు. సోమవారం నాడు చివరిగా అప్‌డేట్ చేయబడిన అంతర్గత మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, 2022లో సముద్రం ద్వారా వలసవచ్చిన 44,700 మందితో పోలిస్తే, ఈ సంవత్సరం ఇప్పటివరకు సముద్రం ద్వారా ఇటలీకి దాదాపు 93,700 మంది వలస వచ్చారు.
