Asianet News TeluguAsianet News Telugu

చైనాలో కరోనా కలకలం.. దేశ జనాభాలో 40% మందికి పాజివిట్!

చైనాలో కరోనా కలకలం సృష్టిస్తుంది. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 20 మధ్య కాలంలో సుమారు 24 కోట్ల మంది ప్రజలు కరోనా వైరస్ బారిన పడ్డారు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 660 మిలియన్లకు  కరోనా బారిన పడినట్టు ఆసియా టైమ్స్ నివేదించింది.

40% Of Chinese Infected With Covid In Last Month: Report
Author
First Published Jan 6, 2023, 4:33 AM IST

చైనాలో కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతున్నయనీ, గత నెలలో ఆ దేశ జనాభాలో 40 శాతంపై కరోనా బారిన పడ్డారని వైద్య నిపుణుల అభిప్రాయాలను ఉటంకిస్తూ ఆసియా టైమ్స్ ఓ నివేదికను వెలువరించింది. అయితే.. దేశంలో కోవిడ్ మరణాల సంఖ్యపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

చైనా  డిసెంబర్ 7 నుండి జీరో కోవిడ్ విధానాన్ని సడలించింది. అప్పటి నుంచి ఇక్కడ పరిస్థితి అదుపు తప్పలేదు. చైనాలో కోవిడ్ కారణంగా రోజుకు 9000 మరణాలు సంభవిస్తున్నాయని ఒక నివేదికలో పేర్కొంది. అధికారిక లెక్కల ప్రకారం ఈ మహమ్మారి కారణంగా 5200 మంది మాత్రమే మరణించారు.వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రాజధాని బీజింగ్ జనాభాలో 22 మిలియన్ల జనాభాలో 80 శాతం , షాంఘైలోని 25 మిలియన్ల జనాభాలో 70 శాతం మంది ఇప్పటివరకు కోవిడ్ బారిన పడ్డారు. అదే సమయంలో.. ఇతర నగరాల్లో కూడా ఈ సంఖ్య 50 శాతానికి పైగా చేరుకుంది.
 
చైనీస్ ఎపిడెమియాలజిస్ట్ జెంగ్ గువాంగ్ ప్రకారం.. చాలా చైనీస్ నగరాల్లో 50 శాతం మంది ప్రజలు కోవిడ్ బారిన పడి మరణించినట్లు నివేదికలు ఉన్నాయి. దాదాపు 50 లక్షల మంది సరైన చికిత్స పొందలేదని అంచనా వేశారు. లండన్‌కు చెందిన ఎయిర్‌ఫినిటీ అనే డేటా సంస్థ ప్రకారం.. కోవిడ్ కారణంగా దేశంలో ప్రతిరోజూ తొమ్మిది వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపింది

చైనీస్ ఎపిడెమియాలజిస్ట్,చైనీస్ నేషనల్ హెల్త్ కమిషన్ యొక్క కోవిడ్ రెస్పాన్స్ ఎక్స్‌పర్ట్ టీమ్ మాజీ అధిపతి లియాంగ్ వాన్నియన్ ప్రకారం.. ప్రస్తుత మహమ్మారి మరణాల రేటును లెక్కించడం చాలా కష్టం. ఈ మహమ్మారి ముగిసిన తర్వాతే ఖచ్చితమైన గణాంకాలు లభిస్తాయని  చెప్పారు. చైనాలో వైరస్ వ్యాప్తి వేగం ఊహించిన దానికంటే వేగంగా ఉందని అన్నారు.

చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ యొక్క అంతర్గత పత్రాల ప్రకారం.. డిసెంబర్ 1 నుంచి 20 మధ్య కాలంలో 248 మిలియన్ల మంది ప్రజలు కరోనావైరస్ బారిన పడ్డారు. ప్రస్తుతం మొత్తం కోవిడ్ ఇన్ఫెక్షన్ల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 665 మిలియన్లకు చేరుకుంది. 6.69 మిలియన్ల మంది మరణించారని ఆసియా టైమ్స్ నివేదించింది.  

ఇదిలా ఉంటే.. బుధవారం నాడు  ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ .. కోవిడ్ పరిస్థితిపై నమ్మకమైన డేటా ఇవ్వాలని చైనాను మరోసారి కోరారు. "హాస్పిటలైజేషన్లు, మరణాలపై మరింత వేగవంతమైన, క్రమమైన, నమ్మదగిన డేటా ను అందించాలి. అలాగే మరింత సమగ్రమైన, నిజ-సమయ వైరల్ సీక్వెన్సింగ్ కోసం తాము చైనాను అడుగుతూనే ఉన్నాము" అని టెడ్రోస్ అన్నారు.  
 
వైరస్ ఎవల్యూషన్‌పై సాంకేతిక సలహా బృందం (TAG-VE) జనవరి 3న చైనా ప్రధాన భూభాగంలో COVID-19 పరిస్థితిని చర్చించడానికి సమావేశమైంది. ఈ  సమావేశంలో.. చైనా CDCకి చెందిన శాస్త్రవేత్తలు దిగుమతి చేసుకున్న వాటి నుండి మరియు స్థానికంగా పొందిన SARS-CoV-2 ఇన్ఫెక్షన్ల నుండి జన్యుసంబంధమైన డేటాను సమర్పించారు.

ఒక ప్రకటన ప్రకారం.. WHO చైనా CDC విశ్లేషణ స్థానికంగా పొందిన అంటువ్యాధులలో BA.5.2, BF.7 వేరియంట్ల ప్రాబల్యాన్ని చూపుతున్నాయి. జెనోమిక్ సీక్వెన్సింగ్ ప్రకారం BA.5.2 మరియు BF.7 మొత్తం స్థానిక అంటువ్యాధులలో 97.5 శాతం ఉన్నాయని ప్రకటన తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కేవలం చైనాలో పరిస్థితినే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కరోనా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తుంది. అన్ని దేశాలు అప్రమత్తంగా ఉండాలని, సీక్వెన్స్‌లను పర్యవేక్షించడానికి. నివేదించడానికి అలాగే వివిధ సబ్ వేరియంట్ల వ్యాప్తిని కూడా తులనాత్మక విశ్లేషించాలని యూఎన్ ఆరోగ్య సంస్థ చెబుతూనే ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios