పలోమర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న బాధిత చిన్నారి ఈ ఉదయం 8:30 గంటలకు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

న్యూఢిల్లీ : అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో సోమవారం 3 ఏళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు తమ 1 ఏళ్ల తోబుట్టువును తుపాకీతో కాల్చి చంపింది.

ఈ సంఘటన శాన్ డియాగో కౌంటీలోని ఫాల్‌బ్రూక్ లో వెలుగు చూసింది. సోమవారం ఉదయం చిన్నారి చేసిన ఫోన్ కాల్ పై స్థానిక పోలీసులు స్పందించారు. వెంటనే వారు అక్కడికి చేరుకోగానే, 3 ఏళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు తమ సంవత్సరం వయసున్న తోబుట్టువును కాల్చి చంపినట్లు గుర్తించారు. 

ఆస్ట్రేలియా బీచ్ లోని మిస్టరీ వస్తువు చంద్రయాన్ -3 శకలమేనా ? ఫొటోలను పోలుస్తూ సోషల్ మీడియాలో చర్చ..

ఆడుకుంటున్న పిల్లవాడికి ఇంట్లో హ్యండ్ గన్ అందుబాటులో కనిపించింది. చిన్నారి దాన్ని కూడా ఆటవస్తువు అనుకుని తీసుకుని.. ప్రయోగించగా సంవత్సరం చిన్నారి తలకు గాయమైంది. 

ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది చిన్నారిని పలోమర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స తీసుకుంటున్న చిన్నారి ఉదయం 8:30 గంటలకు ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.