రియాద్ హోటల్లో ఎయిర్ ఇండియా పైలట్ మృతి

27-yr-old Air India pilot found dead at hotel gym in Saudi Arabia
Highlights

సౌదీ అరేబియాలోని రియాద్ హోటల్లో 27 ఏళ్ల ఎయిర్ ఇండియా పైలట్ మృతి చెందాడు. 

న్యూఢిల్లీ: సౌదీ అరేబియాలోని రియాద్ హోటల్లో 27 ఏళ్ల ఎయిర్ ఇండియా పైలట్ మృతి చెందాడు. బుధవారం ఉదయం అతను హోటల్లో శవమైన కనిపించాడు. రిత్విక్ తివారీ అనే ఆ పైలట్ గుండెపోటతో మరణించాడు. 

హోటల్ హాలిడే ఇన్ హెల్త్ క్లబ్ లోని టాయిలెట్ గది తలుపులు పగులగొట్టి పోలీసులు అందులో పడి ఉన్న శవాన్ని గమనించారు. తివారీ సహోద్యోగి కెప్టెన్ రేణు మౌలే అతన్ని గుర్తించారు.

పైలట్ మరణించిన విషయాన్ని భారత దౌత్య కార్యాలయం అధికారులు గుర్తించారు. హోటల్ జిమ్ లోని వాష్ రూంలో అతను పడిపోయాడు. అతన్ని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మరణించినట్లు వైద్యులు తేల్చారు. 

దౌత్య కార్యాలయం అధికారులు పైటల్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. భారత్ కు మృతదేహాన్ని పంపించడానికి చాలా లాంఛనాలు పూర్తి చేయాల్సి ఉంటుందని అంటున్నారు. 

loader