ఆప్ఘాన్‌లో తాలిబన్ల దాడి: 15 మంది మృతి

15 Afghan security personnel killed in a Taliban attack in Kunduz province of Afghanistan
Highlights

భద్రతా దళాలలపై తాలిబన్ల దాడి


కాబూల్: ఆఫ్ఘనిస్థాన్‌లోని కుందుజ్ ప్రాంతంలో తాలిబన్లు రెచ్చిపోయారు. తాలిబన్ల దాడిలో సుమారు 15 మంది  ఆప్ఘాన్ భద్రతా సిబ్బంది మృతి చెందారు. కాందహర్ ప్రావిన్స్ లోని ఆర్గన్ధాద్ జిల్లాలోని ఓ చెక్ పాయింట్ వద్ద ఈ దాడి చోటు చేసుకొందని అధికారులు ప్రకటించారు.

రంజాన్ సందర్భంగా మూడు రోజుల పాటు కాల్పుల విరమణకు అంగీకరించిన తాలిబన్లు ఈ దాడికి పాల్పడడం చర్చకు దారితీస్తోంది. ఈ దాడికి తామే బాధ్యులమని తాలిబన్లు ప్రకటించారు.

రంజాన్ నేపథ్యంలో మూడు రోజుల పాటు కాల్పుల విరమణను ప్రకటించిన తమపై దాడులకు దిగితే తిప్పి కొడతాామని విదేశీ బలగాలు  లక్ష్యంగా దాడులను కొనసాగిస్తామని శనివారం ప్రకటించింది.

loader