Asianet News TeluguAsianet News Telugu

వారానికి నాలుగు పని దినాలే.. వేతనాల్లో కోత లేదు.. యూకే కంపెనీల ప్రయోగం

యూకేకు చెందిన వంద కంపెనీలు పని దినాలను తగ్గించాలని యోచిస్తున్నాయి. వారానికి నాలుగు పని దినాలను మాత్రమే ఆ వంద కంపెనీలు భావించాయి. వేతనాల్లో కోత లేకుండా గంటలనూ పెంచకుండా రోజులను తగ్గించడం ద్వారా మెరుగైన ఫలితాలు చూస్తున్నామని పేర్కొన్నారు.
 

100 UK companies to switch to four week days
Author
First Published Nov 29, 2022, 4:29 PM IST

న్యూఢిల్లీ: మానవ నాగరికత ఉన్నత దశకు చేరుకుంది. కానీ, మనిషి సంతోషంగా గడపకుండా జీవితంలో సగానికి ఎక్కువ యంత్రాల ముందే కాలం గడుపుతున్నాడు. కుటుంబానికి దూరంగా, సాటి మనుషులకూ దూరంగా జీవిస్తున్నాడు. సేద తీరే సమయం, తీరిక లేని రోజులు గడుపుతున్నాడు. ఇలాంటి జీవితాలూ నాగరికత ఉన్నత దశలో ఉన్నట్టేనా? అనే అనుమానాలు వస్తుంటాయి. అందుకే కాబోలు.. వారంలో పని దినాలను తగ్గించాలని డిమాండ్ క్రమంగా గట్టిగా వినిపిస్తున్నది. వారానికి ఆరు రోజుల స్థానంలో చాలా కంపెనీల్లో ఐదు రోజులు వచ్చింది. ఇది నాలుగు రోజులకు కుదించాలనే క్యాంపెయిన్ కూడా మొదలైంది. ఈ దిశగా యూకే కంపెనీలూ అడుగులు వేస్తున్నాయి.

యూకేలోని వంద కంపెనీలు వారానికి నాలుగు రోజుల పని దినాలు అమలు చేయాలని ఓ శాశ్వత తీర్మానానికి వచ్చాయి. అదీ ఉద్యోగుల వేతనాల్లో కోత పెట్టకుండానే ఈ నిర్ణయం అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈ వంద కంపెనీలు సుమారు 2,600 మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. దేశంలో తాము ఒక పెను మార్పుకు తాము శ్రీకారం చుట్టాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టు కొన్ని కంపెనీలు పేర్కొన్నాయి.

Also Read: వారంలో నాలుగు రోజులే పనిదినాలు.. వర్క్ తర్వాత బాస్‌ ఆదేశాలను నిరాకరించే హక్కు

గత ఆర్థిక కాలానికి చెందిన వారానికి ఐదు పనిదినాల విధానం ఇప్పటికీ అమలు అవుతున్నదని నాలుగు పని రోజుల మద్దతుదారులు అంటున్నారు. వారంలో నాలుగు పని దినాలతో కంపెనీల ప్రాడక్టివిటీ కూడా పెరుగుతుందని, తక్కువ గంటల్లోనే మంచి పని సాధ్యం అవుతుందని పేర్కొంటున్నారు. ఈ విధానం ఉద్యోగులను ఆకర్షించడమే కాకుండా.. నిలుపుకోవడానికి కూడా ఉపకరిస్తుందని వివరించారు.

ఈ వంద కంపెనీల్లో పెద్ద కంపెనీలు ఆటమ్ బ్యాంక్, గ్లోబల్ మార్కెట్ కంపెనీ అవిన్. ఈ రెండు కంపెనీల్లో అటూ ఇటుగా 450 మంది ఉద్యోగులు ఉన్నారు. తాము మొత్తం గంటల సంఖ్యను అలాగే ఉంచి రోజులను (రోజులో పని గంటలు పెంచడం అన్నమాట) తగ్గించలేదని, గంటలను కూడా కుదించామని వివరించారు. ఈ కొత్త విధానంం అమలు చేసిన తర్వాత కంపెనీలో మంచి మార్పులు వచ్చాయని, ఫలితాలు కూడా మెరుగ్గా కనిపిస్తున్నాయని తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios