Asianet News TeluguAsianet News Telugu

మయన్మార్ లో తిరుగుబాటు దారులపై వైమానిక దాడులు.. 100మంది మృతి, పలువురికి గాయాలు..

తిరుగుబాటు దారులపై మయన్మార్ లో మిటలరీ జవాన్లు వైమానిక దాడులు చేశారు. ఈ దాడుల్లో 100మంది మృతి చెందారు. 

100 Killed in Rebel Gathering Myanmar Military Attacks - bsb
Author
First Published Apr 12, 2023, 9:26 AM IST

బ్యాంకాక్ : మంగళవారం సెంట్రల్ మయన్మార్ లో తిరుగుబాటుదారులపై మిలిటరీ జవాన్లు దాడి చేశారు. ఐక్యరాజ్యసమితి పాశ్చాత్య శక్తుల దాడులను ఖండించిన నేపథ్యంలో ఈ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 100 మందికి పైగా మరణించారు. అనేకమంది గాయపడ్డారు. ఆగ్నేయ ఆసియా దేశం మయన్మార్ లో 2021 ఫిబ్రవరిలో మిలటరీ అధికారాన్ని స్వాధీనం చేసుకుంది. అప్పటినుంచి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.  ప్రాణాంతక వైమానిక దాడులు చేశారని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం చీఫ్ వోల్కర్ ఆందోళన వ్యక్తం చేశారు.  

మంగళవారం తెల్లవారుజామున సగయింగ్ ప్రాంతంలోని టౌన్ షిప్ మీద కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో అనేకమంది మరణించారు. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ మయన్మార్ సాయిధ దళాల దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ప్రతినిధి స్టెఫాన్ డుజారిక్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. వాషింగ్టన్ కూడా వైమానిక దాడుల పట్ల తమ తీవ్ర ఆందోళన తెలిపింది. బర్మా ప్రజల సమగ్ర ప్రజాస్వామ్య ఆకాంక్షలను గౌరవించాలని… భయంకరమైన హింసను నిలిపివేయాలని..  బర్మా పాలకులకు యునైటెడ్ స్టేట్స్  పిలుపునిచ్చింది.

అమెరికాలో మెకానిక్‌కు రూ. 328 కోట్లు.. తాను లాటరీ వేసిన నెంబర్ తగలడంతో విన్నర్

ఈ కాల్పుల దాడులు అనంతరం మృతదేహాలను బయటకు తీశారు. వైద్య చికిత్స కోసం  గాయపడిన వారిని తరలించారు. దీంతో మృతుల సంఖ్య వంద దాటవచ్చని అధికారులు అంచనా వేశారు.  జర్మనీ విదేశాంగ కార్యాలయం కూడా వైమానిక దాడులు పౌరులను మయన్మార్ సైన్యం చంపడాన్ని తీవ్రంగా ఖండించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios