Asianet News TeluguAsianet News Telugu

అమెరికాలో మెకానిక్‌కు రూ. 328 కోట్లు.. తాను లాటరీ వేసిన నెంబర్ తగలడంతో విన్నర్

అమెరికాకు చెందిన ఓ విశ్రాంత మెకానిక్‌ రూ. 328 లాటరీ టికెట్ గెలుచుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ వ్యక్తికి సంతోషం అవద్దులేకుండా పోయాయి.
 

american retd mechanic wins lottery ticket worth of 328 crore kms
Author
First Published Apr 12, 2023, 6:06 AM IST

న్యూఢిల్లీ:  అమెరికాలోని ఓ రిటైర్డ్ మెకానిక్‌కు శ్రమ లేకుండా సుమారు 328 కోట్లు ఇంటి తలుపు తట్టాయి. ఆయన అయోవా లాటరీలో పాల్గొన్నాడు. అయోవా రాష్ట్రంలోని డబ్యూక్ నగరంలో ఆ విశ్రాంత మెకానిక్ నివసిస్తున్నాడు. 

61 ఏళ్ల ఎర్ల్ లాపే ఏప్రిల్ 1వ తేదీన లొట్టో అమెరికా అనే లాటరీ టికెట్ కొనుక్కున్నాడు. అయితే, అదృష్టవశాత్తు తన లాటరీ నెంబరే తగిలింది. దీంతో ఆయనకు 40 మిలియన్ డాలర్ల బహుమతి లభించింది. లాటరీ గెలుచుకున్న విషయం తెలుసుకున్న తర్వాత ఎర్ల్ లాపే ఆనందానికి అవధులే లేకుండా పోయాయి. 

తొలుత తనకు తెలిసినప్పుడు అది వట్టి జోక్ అనుకున్నానని వివరించాడు. ఏప్రిల్ ఫూల్ డే నాడు లాటరీ గెలుచుకోవడం.. దాన్ని అంత సులువుగా తాను నమ్మలేదని తెలిపాడు. ఇక తాను ఏప్రిల్ ఫూల్ అవుతాడేమోనని బిగ్గరగా నవ్వేశాడు. కానీ, అలాంటిదేమీ జరగలేదు.

Also Read: శృంగారంలో రిస్కీ పొజిషన్ ట్రై చేయడంతో పురుషాంగం ఫ్రాక్చర్.. ఎమర్జెన్సీ సర్జరీ చేసిన వైద్యులు

తాను నిజంగానే లాటరీ గెలుచుకున్నానని సంతోషించాడు. ఆ బహుమతి మొత్తాన్ని ఏకకాలంలో పొందే ఆప్షన్ ఎంచుకున్నాడు. దీంతో ఆయనకు 21.28 మిలియన్ డాలర్ల సొమ్ము ముట్టింది. అదే ఏడాదికి కొంత చొప్పున తీసుకుంటే 29 ఏళ్ల కాలానికి రూ. 40 మిలియన్ డాలర్లు (అంటే సుమారు 328 కోట్ల రూపాయలు) ఎర్ల్ లాపేకు అందేది. 

లాటరీలో గెలుచుకున్న డబ్బును కుటుంబ అవసరాలకు ఖర్చు చేస్తానని లాపే తెలిపాడు. అంతేకాదు, ఆరోగ్య సమస్యలతో బాధపడే చిన్నారులను ఆదుకునేందుకు ప్రయత్నిస్తా అని వివరించాడు.

Follow Us:
Download App:
  • android
  • ios