హైదరాబాద్ అంబర్‌పేటలో దారుణం జరిగింది. భర్త వేధింపులు భరించలేక భార్య ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే... అంబర్‌పేటకు చెందిన వ్యాపారి మురళి కుమారుడు సుకీత్ ఐదేళ్ల క్రితం కార్వాన్ ప్రాంతానికి చెందిన శివానీని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు కావడంతో వీరి పెళ్లికి ఇరు కుటుంబాల నుంచి అభ్యంతరం తెలపలేదు. వివాహం తర్వాత కొన్నేళ్లు సజావుగా సాగిన వీరి కాపురంలో కలతలు మొదలయ్యాయి.

Also read:విజయవాడలో చిచ్చురేపిన టిక్ టాక్

మరో యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్న సుకీత్ తన భార్యను నిర్లక్ష్యం చేశాడు. వీరిద్దరి వ్యవహారం తెలుసుకున్న శివానీ భర్తను ప్రశ్నించడంతో అప్పటి నుంచి వేధింపులు మొదలయ్యాయి.

ఆరు నెలలుగా వేధింపులు మరింత తీవ్రమవ్వడంతో శుక్రవారం రాత్రి శివానీ అంబర్‌పేటలోని తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే శుక్రవారం రాత్రి 8.45 గంటలకు తన సోదరితో ఫోన్‌లో మాట్లాడిన శివానీ.. అమ్మకు చీర కొంటానని చాలా సరదాగా చెప్పిందని ఆమె సోదరి చెబుతోంది.

ఆ తర్వాత కొద్దినిమిషాల్లోనే శివానీ ఉరేసుకోవడం పట్ల ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉరేసుకోవడానికి సరిపోయేలా ఆ ఇంటి పైకప్పు లేదని వారు వాదిస్తున్నారు. ‘‘నువ్వు చచ్చిపో.. తాను మరో పెళ్లి చేసుకుంటా’’ అంటూ సుకీత్ తమ బిడ్డను వేధింపులకు గురిచేసేవాడని వారు ఆరోపిస్తున్నారు.

శివానీ మృతిపై ఆమె తల్లిదండ్రులు అంబర్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

టిక్‌టాక్ ద్వారా పరిచయమైన ఓ మహిళను ఓ వ్యక్తి వివాహం చేసుకొన్నాడు. అయితే తనకు పెళ్లైన విసయాన్ని దాచిపెట్టి మరో పెళ్లి చేసుకొన్నాడు. అంతేకాదు రెండో పెళ్లి విషయం తెలుసుకొన్న మొదటి  భార్యను హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు. ఈ విషయం తెలుసుకొన్న మొదటి భార్య అతనిపై కేసు పెట్టింది. ఈ ఘటన కృష్ణా జిల్లా విజయవాడలో చోటు చేసుకొంది.

Also Read:సంసారంలో చిచ్చు రేపిన టిక్‌టాక్‌: మొదటి భార్య హత్యకు యత్నం, చివరికిలా..

ఇబ్రహీంపట్నంలో వీటీపీఎస్‌లో సత్యరాజ్ పనిచేస్తున్నాడు. సత్యరాజ్‌కు పెళ్లైంది. కానీ, సత్యరాజ్  మాత్రం తనకు పెళ్లైన విషయాన్ని దాచిపెట్టాడు. ఏడాదిగా టిక్ టాక్ చేస్తున్న సమయంలో ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. ఏడాదిగా ఆ మహిళతో టిక్ టాక్ వీడియోలు చేసేవాడు.

టిక్ టాక్‌లో పరిచయం ఉన్న మహిళను సత్యరాజ్‌ ఇటీవలనే తిరుపతిలో పెళ్లి చేసుకొన్నాడు. భర్త సత్యరాజ్ ప్రవర్తనలో మార్పు వచ్చిన విషయాన్ని భార్య  అనురాధ గుర్తించింది. ఇదే విషయాన్ని భర్తను నిలదీసింది. అతను సమాధానం ఇవ్వలేదు.

తాను రెండో పెళ్లి చేసుకొన్న విషయాన్ని గుర్తించిందని అనురాధను చంపేందుకు భర్త సత్యరాజ్ ప్రయత్నించాడు. అయితే భర్త సత్యరాజ్ నుండి అనురాధ తప్పించుకొంది.