మందు బాబులకు కిక్కిచ్చే న్యూస్‌.. డిసెంబర్ 31వ తేదీ రాత్రి.. ప్రభుత్వం కీలక నిర్ణయం.

కొత్తేడాదికి వెల్‌కమ్‌ చెప్పేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. మరో మూడు రోజుల్లో 2024 ఏడాది కాల గర్భంలో కలిసిపోనుంది. దీంతో న్యూ ఇయర్‌ వేడుకలను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకోవాలని ప్లాన్స్‌ వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31వ తేదీ రాత్రి మందు బాబులకు గుడ్ న్యూస్‌ చెప్పింది.. 
 

Wines and bars timing extend on december 31st in telangana VNR

డిసెంబర్‌ 31వ తేదీ వచ్చిందంటే చాలు మందు బాబులు ఫుల్‌ జోష్‌లో ఉంటారు. న్యూ ఇయర్‌కి వెల్‌కమ్‌ చెప్పే ఈవెంట్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకుంటారు. ఇక ఇయర్ ఎండ్‌ అనగానే గుర్గొచ్చే మరో అంశం మందు. ఇయర్‌ ఎండ్‌కి మద్యం ఏరులై పారడం సర్వసాధారణం. ప్రతీ ఏటా మద్యం అమ్మకాలు ఓ రేంజ్‌లో జరుగుతాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అందులోనూ హైదరాబాద్‌లో మద్యం అమ్మకాలు భారీగా జరుగుతాయి. ఈ నేపథ్యంలోనే ఈసారి మందు బాబుల కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వైన్స్ షాపుల సమయం విషయంలో కీలక మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

సమయం పొడగిస్తూ.. 

సాధారణ రోజులతో పోల్చితే డిసెంబర్‌ 31వ తేదీన రాత్రి వైన్స్‌ సమయాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే మంగళవారం రోజు బార్లు, రెస్టారెంట్లలో అదనపు గంటలు తెరిచి ఉంచనున్నారు. వైన్ షాపులు అర్ధరాత్రి 12 గంటల వరకు, బార్లు, రెస్టారెంట్లు, ఈవెంట్‌ పర్మిషన్లను ఒంటి గంట వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సమయం పొడిగించిన నేపథ్యంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. 

ప్రత్యేక నిఘా.. 

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదనే నేపథ్యంలో హైదరాబాద్‌ పరిధిలోని ఈవెంట్స్‌, పార్టీలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ప్రభుత్వం తెలిపింది. అలాగే న్యూ ఇయర్‌ వేడుకల్లో డ్రగ్స్‌ వినియోగం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో న్యూ ఇయర్‌ వేడుకల్లో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాత్రి 10 గంటల తర్వాత అవుట్‌ డోర్‌లో రాత్రి 10 గంటలు దాటిన తర్వాత లౌడ్‌ స్పీకర్లు ఉపయోగించకూడదని ఆదేశాలు జారీ చేశారు. 

డ్రంక్‌ అండ్ డ్రైవ్‌

యువతకు సైతం పోలీసులు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. తాగి డ్రైవ్‌ చేసి పట్టుపడితే కఠినమైన చర్యలు ఉంటాయని తేల్చి చెప్పారు. రూ. 10 వేల జరిమానాతో పాటు ఆరు నెలలపాటు జైలు శిక్ష కూడా ఉంటుందని హెచ్చరించారు. రోడ్లపై ప్రజలకు ఇబ్బందులు గురిచేస్తే కేసులు బుక్‌ చేస్తామని హెచ్చరించారు. మొత్తం మీద ఇయర్‌ ఎండ్‌కి ప్రభుత్వం మందు బాబులకు గుడ్‌ న్యూస్‌ చెబుతూనే మరోవైపు శాంతిభద్రతల విషయంపై కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించింది ప్రభుత్వం. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios