తుక్కుగూడ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల్లో రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు ఎక్స్‌అఫీషియో ఓటు వివాదంపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల సంఘం తరపు న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది.

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఎక్స్‌అఫీషియో హోదాలో తుక్కుగూడ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలో ఓటు వేశారు. అయితే ఏపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ప్రాతినిథ్యం వహిస్తున్న కేశవరావు ఓటు చెల్లదని ఎనిమిది మంది బీజేపీ కౌన్సిలర్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Also Read:కేకే ఆంధ్రా ఎంపీ.. ఆధారం ఇదే: తుక్కుగూడలో ఓటుపై కోర్టుకెళ్తామన్న లక్ష్మణ్

ఎన్నికల అధికారిగా వ్యవహరించిన మున్సిపల్ కమీషనర్‌పై చర్యలు తీసుకోవాలని పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇలాంటి వివాదాలను ఎన్నికల ట్రిబ్యునల్‌లో తేల్చుకోవాలని హైకోర్టుకు ఎందుకు వచ్చారని న్యాయస్థానం ఇరువర్గాలను ప్రశ్నించింది.

దీనిపై స్పందించిన పిటిషనర్ తరపున న్యాయవాదులు.. రాష్ట్రంలో ఇంకా ఎన్నికల ట్రిబ్యునల్ ఏర్పాటు కాలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో వివాదానికి సంబంధించిన పూర్తి వివరాలను కోర్టుకు అందజేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. 

టీఆర్ఎస్ ఎంపీ కే. కేశవరావు ఆంధ్రా ఎంపీ అని రాజ్యసభ సెక్రటేరియేట్ స్పష్టం చేసిందన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్. తుక్కుగూడ ఎక్స్‌అఫిషియో ఓటుకు సంబంధించి గత మంగళవారం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు నుంచి కూడా తమకు లేఖ అందిందన్నారు

Also Read:ఢిల్లీకి ఎక్స్ అఫిషియో పంచాయతీ...కేకే పై బీజేపీ ఫిర్యాదు

ఆంధ్రా ఎంపీల లిస్ట్ కేకే నాలుగో వ్యక్తని.. తెలంగాణ రాజ్యసభ సభ్యుల లిస్ట్‌లో కేశవరావు పేరే లేదని లక్ష్మణ్ స్పష్టం చేశారు. అంతకు ముందు తుక్కుగూడ మున్సిపల్ ఎన్నికల్లో 15వ వార్డులకు గాను బీజేపీ 9, టీఆర్ఎస్ 5 వార్డుల్లో విజయం సాధించాయి.

అయితే ఎక్స్అఫిషీయో సభ్యులతో టీఆర్ఎస్ తుక్కుగూడ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. ఇక్కడే అసలు వివాదం మొదలైంది. ఎక్స్‌అఫిషీయో సభ్యుల్లో ఒకరైన ఎంపీ కేశవరావు వేసిన ఓటు వివాదాస్పదం అయ్యింది.