టిఆర్ఎస్ రాజ్యసభపక్ష నేత ఎంపీ కే కేశవరావుపై రాజ్యసభ ఛైర్మన్ కు  తెలంగాణ బీజేపీ నాయకులుశనివారం ఫిర్యాదు చేశారు.ఇటీవల జరిగిన మున్సిపోల్స్ ఎన్నికల్లో ఎక్స్ అఫిషియో ఓట్ల తో అధికార పార్టీ కాంగ్రెస్, బీజేపీ లకంటే తక్కువ స్థానాలు వచ్చినా టిఆర్ఎస్ అభ్యర్థులను చైర్మన్లుగా చేసుకోగలిగింది.

 దాదాపు 15 చోట్ల ఇలాంటి పరిస్థితులు తలెత్తాయి. అయితే ఈ విషయంలో మాత్రం బిజెపి పార్టీ సీరియస్ గా వ్యవహరిస్తోంది. తుక్కుగూడమున్సిపాలిటీ లో  లార్జెస్ట్ పార్టీగా అవతరించిన అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పదిందని బిజెపి ఆరోపణలు చేస్తోంది.

  కేకే ఓటు హక్కు వినియోగించుకోవడాన్ని బీజేపీ తప్పుబడుతోంది. ఏపీకి  రాజ్యసభ సభ్యుడిగా కేకే ను సాంకేతికంగా కేటాయించినా తెలంగాణలో ఓటు ఎలా కేటాయిస్తారని బీజేపీ ప్రశ్నిస్తుంది.ఇదే అంశంపై రాజ్యసభ ఛైర్మెన్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు బీజేపీ ఫిర్యాదు చేసింది.

 ఓటు హక్కు కేకే తెలంగాణా లో వినియోగించుకోవడం పై ఎథిక్స్ కమిటీకి అప్పగించి  చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. ఎక్స్ అఫిషియో ఓటర్ల కారణంగానే తాము కొన్ని మున్సిపాలిటీలు  కోల్పోవాల్సి వచ్చిందని బిజెపి, కాంగ్రెస్ పార్టీలు వాపోతున్నాయి.

 అధికార పార్టీ మాత్రం మేము ఇది కొత్తగా తెచ్చిన  నిబంధనలు కావని గతంలో ఉన్న నిబంధనలే అని వాదిస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో  ఎక్స్ అఫిషియో వివాదం తెలంగాణలో  రాజుకుని పంచాయతీ ఢిల్లీకి చేరినట్లు అయింది.