హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. కొంతకాలంగా అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోకుండా ఎవరి పనుల్లో వారు మునిగిపోయారు. అయితే తాజాగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి భూముల వ్యవహారంతో మరోసారి వాతావరణం వేడెక్కింది. రేవంత్ గోపన్ పల్లిలో భూములను అక్రమంగా కబ్జా చేశాడంటూ ప్రభుత్వం చర్యలను కూడా దీంతో ప్రారంభించింది. దీనిపై రేవంత్ ఏమాత్రం వెనక్కితగ్గకుంగా కేటీఆర్ పామ్ హౌస్ ను ఈ వివాదంలోకి లాగాడు. దీంతో ఈ వ్యవహారం రసవత్తరంగా మారింది. 

111 జీవో పరిధిలో మంత్రి కేటీఆర్ అక్రమంగా ఫామ్ హౌస్ ను నిర్మించుకున్నాడంటూ రేవంత్ ఆరోపిస్తున్నారు. కేవలం ఆరోపణలు చేయడమే కాదు డ్రోన్ కెమెరాల సాయంతో ఆ ఫామ్ హౌస్ ఫోటోలను కూడా సంపాందించాడు.  కానీ ఎలాంటి అనుమతులు లేకుండా డ్రోన్ కెమెరాలను వినియోగించాడన్న అభియోగాలతో ఆయనను  పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

read more  గోపన్‌పల్లి భూములపై చట్ట ప్రకారంగానే వ్యవహరించాలి: రేవంత్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టు

తాజాగా ఈ వివాదంపై  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. రేవంత్ ఆరోపిస్తున్నట్లు ఆ ఫామ్ హౌస్ కేటీఆర్ దే అని పేర్కొన్నారు. కానీ దాన్ని నిర్మించింది మాత్రం ఆయన కాదని... కేవలం లీజుకు మాత్రమే తీసుకున్నాడని అన్నారు. కాబట్టి ఆ ఫామ్ హౌజ్ అక్రమమైనా, సక్రమమైనా ఆయనకు సంబంధం లేదని... దాని యాజమాన్యానిదే అని తలసాని పేర్కొన్నారు. 

కాంగ్రెస్ నాయకులే 111జీవోను పెంచి పోషించారని... దీన్ని అడ్డం పెట్టుకుని గతంలో అక్రమాలకు పాల్పడిందన్నారు.  ఇప్పుడు కూడా రాజకీయాలు చేయడానికే ఈ జీవో ప్రస్తావన తీసుకువచ్చారని అన్నారు. ఇలాంటి రాజకీయాలు చేయడంవల్లే ఆ పార్టీ పరిస్థితి ఇలా తయారయ్యిందని తలసాని  మండిపడ్డారు. 

read more  చంచల్‌గూడ జైలుకు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి